ETV Bharat / bharat

తల్లి శవంతో ఐదు రోజులు గడిపిన కుమార్తె - daughter with mother deadbody news

కర్ణాటకలో ఓ తల్లి చనిపోయినా... ఆమె శవంతోనే ఐదు రోజులు గడిపింది కుమార్తె. దుర్వాసన వస్తుందని తలుపులు పగులగొట్టి ఇంట్లోకి వచ్చి చూసిన పొరుగువారు విషయం తెలిసి షాక్​కు గురయ్యారు.

A daughter spends five days with her mother's dead body
తల్లి శవంతో ఐదు రోజులు గడిపిన కూతురు
author img

By

Published : May 19, 2020, 8:18 PM IST

కర్ణాటక శివమొగ్గలో దయనీయ ఘటన జరిగింది. క్యాన్సర్​తో బాధపడుతూ మృతి చెందిన కన్నతల్లి శవంతో ఐదు రోజులు గడిపింది ఓ కూతురు. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుందని గమనించిన పొరుగువారు తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించాక కుళ్లిన తల్లి శవం పక్కన కూతుర్ని చూసి షాక్​కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

మృతి చెందిన మహిళ పేరు రాజేశ్వరి(64). విశ్రాంత ఉపాధ్యాయురాలు. కొద్ది సంవత్సరాలుగా ఆమె క్యాన్సర్​తో బాధపడుతున్నారు. మే 13న మాత్రలను మోతాదుకు మించి తీసుకున్నారు. వెంటనే ప్రాణాలు కోల్పోయారు. కూతురు ఆమె పక్కనే అలా ఉండిపోయింది.

పోలీసులు కేసు నమోదు చేశారు. రాజేశ్వరి భౌతిక కాయాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఐదు రోజుల పాటు తల్లి శవంతోనే గడిపిన కూతురు మానసిక స్థితిపై అనుమానంతో ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.