ETV Bharat / bharat

కరోనాను తరిమికొట్టేందుకు ఆసుపత్రిలో 'యోగా' పాఠాలు! - bellari yoga for corona

కరోనా మహమ్మారి సోకిన వ్యక్తుల్లో ఒత్తిడిని జయించేందుకు ఆసుపత్రిలో యోగా తరగతులు నిర్వహిస్తున్నాడో కొవిడ్​ పేషెంట్​. తాను ముస్లిం మతానికి చెందినా.. మనసును శాంతపరిచే హిందూ శ్లోకాలు అనర్గళంగా చదివేస్తున్నాడు. బాధితుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నాడు.

A corona Patient teaches the Yoga in Hospital for Others to Get Relaxation From COVID in bellari, karnataka
సాటి రోగులకు యోగా నేర్పుతున్న కరోనా పేషెంట్​!
author img

By

Published : Jul 18, 2020, 7:09 AM IST

కర్ణాటక బళ్లారిలో కరోనా కేసులు, మృతుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. దీంతో బాధితులంతా బెంబేలెత్తిపోతున్నారు. కానీ, ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్​ చాంద్ ​పాషా మాత్రం.. కరోనాకు భయపడే పనేలేదంటున్నాడు. యోగా, ఆయుర్వేదంతో సాటి రోగుల్లో బతుకుపై ఆశలు కల్పిస్తున్నాడు.

A corona Patient teaches the Yoga in Hospital for Others to Get Relaxation From COVID in bellari, karnataka
సాటి రోగులకు యోగా నేర్పుతున్న కరోనా పేషెంట్​!

కంప్లీ తాలూకాలో మున్సిపల్​ కౌన్సిల్​ సభ్యుడు చాంద్​పాషాకు కరోనా సోకింది. చికిత్స మేరకు స్థానిక వీఐఎమ్​ఎస్​ ఆసుపత్రిలో చేరాడు. అక్కడ కరోనా బాధితులు చావు భయంతో వణికిపోతున్నారని గమనించాడు. ఆత్మబలం ఉంటే కరోనాను జయించొచ్చని వారికి నచ్చజెప్పాడు పాషా. వారిలోని ఒత్తిడిని పోగొట్టేందుకు ఉదయం తన వార్డులో ఉన్నవారిచేత యోగాసనాలు వేయించడం మొదలెట్టాడు.

అంతే కాదు, మనసును ఉల్లాసంగా మార్చే సంస్కృత మంత్రాలు, హిందూ శ్లోకాలు చదివి వినిపిస్తున్నాడు. ముస్లిం మతానికి చెందిన పాషాకు.. హిందూ శ్లోకాలు అంత బాగా ఎలా వచ్చని తోటివారు అడిగితే, 'నేను ముస్లిం కంటే ముందు భారతీయుడిని' అని సమాధానమిస్తున్నాడు. రోజూ రోగనిరోధక శక్తిని పెంచే కషాయం తయారు చేసి తాను తాగుతూ.. నలుగురికీ పంచుతున్నాడు.

ఇదీ చదవండి: తాటి చెట్టుపైనే స్పృహ తప్పాడు.. 2 గంటల తర్వాత..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.