జమ్ముకశ్మీర్ పుల్వామాలో ఉగ్రవాదులు మరోసారి కాల్పులకు తెగించారు. ఓ పౌరుడిని తుపాకీతో కాల్చి హతమార్చారు. చనిపోయిన వ్యక్తిని గులాం నబీమీర్గా గుర్తించారు అధికారులు. వృత్తిరీత్యా కాంట్రాక్టర్ అయిన నబీని ట్రాల్‌లోని అతని నివాసం బయటే హత్య చేసినట్లు తెలిపారు.
రాత్రి 7.30 గంటలకు ఘటన జరిగిందని వెల్లడించారు. 7.20 గంటలకు మీర్‌కు ఫోన్ రాగానే.. ఎవరినో కలిసేందుకు బయటికి వచ్చిన అతనిపై దుండగులు పలుమార్లు కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. మీర్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారని చెప్పారు.