జంగిల్‌బుక్ సినిమాలో మోగ్లీ, బగీరాల స్నేహం గుర్తుందా? ఆ చిత్రంలో పట్టుమని పదేళ్లు కూడా నిండని బాలుడికి.. భారీ చింపాజీతో స్నేహం కుదరడం.. అది ఆ బాలుడిని ఆపదల నుంచి కాపాడడం ఎంతో ఆసక్తిగా ఉంటుంది. మహారాష్ట్ర అహ్మద్‌నగర్‌లో అచ్చం అలాంటి కథే కనిపిస్తోంది. చిన్న పిల్లలు ఓ చిరుతతో చెలిమి చేయడం.. దానితో ఆటలు ఆడుకోవడం జంగిల్‌బుక్ సినిమాని తలపిస్తోంది.
కొద్దిరోజుల క్రితం గ్రామం సమీపంలోకి ఓ చిరుత కుటుంబ సమేతంగా వచ్చింది. ఇదే సమయంలో పొలాల్లో చిన్న చిరుతను చూసిన ముగ్గురు పిల్లలు భయపడి వెంటనే వెళ్లి పెద్దలకు చెప్పేశారు. ఆ చిరుత తల్లి చూస్తే అందరినీ తినేస్తుందని అందరూ హడలెత్తిపోయారు. ఆ చిరుతలు కాసేపు ఉండి అడవిలోకి వెళ్లిపోయాయి. దీంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.
అయితే మరుసటి రోజు మళ్లీ వచ్చింది ఆ చిన్న చిరుత. అలా ప్రతిరోజూ ఆ గ్రామానికి రావడం మొదలెట్టింది. మనుషులను చూసి ఉత్సాహంగా గెంతులేస్తుంది. దీంతో అక్కడి పిల్లలకు అదెంతో నచ్చేసింది. చిన్నారి చిరుతతో స్నేహం చేశారు. రోజూ బడికి వెళ్లేముందు దానికి టాటా చెప్పడం, బడి నుంచి వచ్చాక దానితో ఆడుకోవడం మొదలెట్టారు. దానికి బధీరా అని పేరు కూడా పెట్టుకున్నారు.
అయితే అన్ని చిరుతలూ బగీరాలా సౌమ్యంగా ఉండవు కాబట్టి, ఆ ప్రాంతంలోని చిరుతల సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు స్థానికులు.
ఇదీ చూడండి: దిల్లీ పాఠశాలలకు సెలవుల పొడిగింపు- పరీక్షలు వాయిదా