ETV Bharat / bharat

టపాసులు తిని మరో గజరాజు మృతి! - elephant eating crackers and died in Coimbatore

కేరళలో పేలుడు పదార్థాలు తిని మరణించిన ఏనుగు తరహాలోనే తమిళనాడులో మరో గజరాజు ఆకతాయిల రాక్షసత్వానికి బలైంది. కొద్ది రోజుల క్రితమే నోటికి తీవ్ర గాయమై తల్లడిల్లిన ఆ ఏనుగు కన్నుమూసినట్లు కోయంబత్తూర్​ అటవీ శాఖ అధికారులు వెల్లడించారు.

a-12-year-old-male-elephant-died-after-eating-crackers-at-jambukandi-village-in-outskirts-of-coimbatore
టపాసులు తిని మరో గజరాజు మృతి!
author img

By

Published : Jun 22, 2020, 12:50 PM IST

Updated : Jun 22, 2020, 4:30 PM IST

తమిళనాడు కోయంబత్తూరు జిల్లాలో కొద్ది రోజుల క్రితం పేలుడు పదార్ధాలు తిన్న ఓ గజరాజు.. జంబుకండి గ్రామ శివారులో శవమై కనిపించింది.

కొద్ది రోజుల క్రితం కేరళలో గర్భిణి గజం నోటికి గాయమైనట్టే కోయంబత్తూర్​ మంగారాయ్ ప్రాంతంలో ఓ 12 ఏళ్ల గజరాజు గాయపడి కనిపించడం చర్చనీయాంశమైంది. సమాచారమందుకున్న అటవీ శాఖ అధికారులు ఏనుగుకు వైద్య పరీక్షలు చేయించారు. కేరళ ఏనుగు తరహాలోనే.. ఈ ఏనుగు నోటికి గాయాలు ఉన్నట్లు గుర్తించారు.

a-12-year-old-male-elephant-died-after-eating-crackers-at-jambukandi-village-in-outskirts-of-coimbatore
టపాసులు తిని మరో గజరాజు మృతి!

అడవి పందుల కోసం అక్రమ వ్యాపారులు ఏర్పాటుచేసిన పేలుడు పదార్థాలను తినడం వల్లే ఇది గాయపడిందని భావించిన అధికారులు దర్యాప్తు చేపట్టారు. వాస్తవాలు తెలిసేలోపే ప్రాణాలు పిండేస్తున్న నొప్పిని భరించలేక.. ఆ గజరాజు ప్రాణాలు విడిచింది.

ఇదీ చదవండి:ఏనుగు నోటికి గాయం- టపాసులే కారణం?

Last Updated : Jun 22, 2020, 4:30 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.