ETV Bharat / bharat

'అయోధ్య తీర్పు రివ్యూ.. 99 శాతం ముస్లింల ఆకాంక్ష' - all india personal law board

దేశంలోని 99 శాతం మంది ముస్లింలు అయోధ్య కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పును పునర్విచారించాలని కోరుకుంటున్నట్లు అఖిల భారత ముస్లిం పర్సనల్​ లా బోర్డ్​ ( ఎఐఎమ్​పీఎల్​బీ) స్పష్టం చేసింది. రివ్యూ పిటిషన్​ దాఖలు చేస్తామని పునరుద్ఘాటించింది.

99pc Muslims want review of SC judgment on Ayodhya dispute: AIMPLB
'అయోధ్య తీర్పు రివ్యూ.. 99 శాతం ముస్లింల ఆకాంక్ష'
author img

By

Published : Dec 1, 2019, 3:58 PM IST

అయోధ్య రామమందిరం-బాబ్రీ మసీదు కేసులో సుప్రీం ఇచ్చిన చారిత్రక తీర్పుపై రివ్యూ కోరే విషయంలో వెనక్కి తగ్గేది లేదని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డ్​ తేల్చిచెప్పింది. డిసెంబర్​ 9లోపు పునర్విచారణ వ్యాజ్యం దాఖలు చేస్తామని ఇంతకుముందే ప్రకటించినట్లు ప్రస్తావించింది.

దేశంలోని 99 శాతం మంది ముస్లింలు... సుప్రీం కోర్టు తీర్పుపై రివ్యూ కోరుకుంటున్నారని స్పష్టం చేసింది బోర్డ్​.

"ముస్లింలకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది. అందుకే రివ్యూ పిటిషన్​ దాఖలు చేస్తున్నాం. అయితే అయోధ్య కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పు ఆ నమ్మకాన్ని సన్నగిల్లేలా చేసింది. పిటిషన్​ కొట్టివేస్తారు అని దాఖలు చేయకుండా ఉండం కదా. రివ్యూ పిటిషన్​ కోరడం చట్టబద్ధమైన హక్కు. సుప్రీం ఇచ్చిన తీర్పులో కొన్ని పరస్పర విరుద్ధ అంశాలు ఉన్నాయి." - మౌలానా వలీ రహ్మానీ, ఎఐఎమ్​పీఎల్​బీ ప్రధాన కార్యదర్శి

సుప్రీం తీర్పుతో అయోధ్య వివాదానికి ముగింపు పలకాలని సూచించిన వారిపై మౌలానా మండిపడ్డారు.

"మసీదు పట్ల ఎలాంటి శ్రద్ధ లేనివారే అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. వారు భయంతో బతుకుతున్నారు. అందరూ అలానే ఉండాలని కోరుకుంటున్నారు. మేధావులు ఈ అంశంపై మాట్లాడుతున్నప్పటికీ.. వారెవరి దగ్గర ముస్లిం వర్గాల సమస్యలను పరిష్కరించే ప్రణాళిక లేదు. సూచనలు ఇచ్చేవారిని ముస్లిం వర్గానికి ఏం చేశారని ప్రశ్నించాలి." - మౌలానా వలీ రహ్మానీ, ఎఐఎమ్​పీఎల్​బీ ప్రధాన కార్యదర్శి

అయోధ్య కేసులో ఒక కక్షిదారైన సున్నీ సెంట్రల్​ వక్ఫ్​ బోర్డ్​ రివ్యూ పిటిషన్ దాఖలుకు మొగ్గు చూపలేదు. అయితే ప్రత్యామ్నాయ స్థలంలో మసీదు నిర్మాణానికి సుప్రీం కేటాయించిన 5 ఎకరాలను అంగీకరించాలా? వద్దా అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

AP Video Delivery Log - 0900 GMT News
Sunday, 1 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0821: Hong Kong Wong AP Clients Only 4242552
Activist Joshua Wong joins HK '5 Demands' rally
AP-APTN-0804: Hong Kong US March AP Clients Only 4242550
Hong Kong rally thanking US for its support
AP-APTN-0755: Mexico Gunbattle Aftermath AP Clients Only 4242548
Aftermath of deadly gunbattle in Villa Unión
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.