ETV Bharat / bharat

మహారాష్ట్రలో కొత్తగా 14,888 కేసులు.. 295 మంది మృతి - #covid-19

దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఉత్తర్​ప్రదేశ్​ కొత్తగా 5,900 మంది వైరస్​ బారిన పడ్డారు. మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లోనూ కొవిడ్​ కేసులు భారీగా వెలుగుచూస్తున్నాయి.

82 COVID-19 deaths, highest single-day spike of 5,898 cases takes tally past 2 lakh-mark in UP
మహాలో కొత్తగా 14,888 కరోనా కేసులు.. 295 మంది మృతి
author img

By

Published : Aug 26, 2020, 7:15 PM IST

Updated : Aug 26, 2020, 9:20 PM IST

భారత్​లో మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. మహారాష్ట్రలో కొత్తగా 14,888 మంది వైరస్​ బారిన పడ్డారు. మరో 295 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం కేసులు 7 లక్షల 19వేలకు చేరువలో ఉన్నాయి. ఉత్తర్​ప్రదేశ్​, దిల్లీ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లోనూ కొవిడ్​ కేసులు విపరీతంగా బయటపడుతున్నాయి.

యూపీలో 2 లక్షలు దాటిన కేసులు..

ఉత్తర్​ప్రదేశ్​లో కొత్తగా 5,898 మంది వైరస్ ​బారిన పడగా... 82 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 2 లక్షలు దాటింది.

తమిళనాడులో 6 వేలు..

తమిళనాడులో వైరస్​ రికవరీ రేటు మెరగవుతున్నప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా 5,958 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. మరో 118 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 52,362 మంది చికిత్స పొందుతున్నారు.

  • బంగాల్​లో తాజాగా 2,974మందికి కరోనా సోకింది. మరో 55 మంది మరణించారు.
  • కేరళలో కొత్తగా 2,476 మంది వైరస్​ బారిన పడ్డారు.
  • దిల్లీలో ఒక్కరోజే 1,693 కేసులు నమోదవగా.. 17మంది చనిపోయారు.
  • జమ్ముకశ్మీర్​లో గడిచిన 24 గంటల్లో 700మందికి వైరస్​ పాజిటివ్​గా తేలింది.

మాజీ సీఎంకు కరోనా..

అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్​ గొగొయికు కరోనా సోకింది. ఈ నేపథ్యంలో తనను ఇటీవల కలిసిన వ్యక్తులు కొవిడ్​ పరీక్ష చేసుకోవాలని సూచించారు తరుణ్​.

76 శాతం పైనే రికవరీ..

దేశంలో రికవరీ రేటు 76.30 శాతానికి చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 24,67,758 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. ఫలితంగా యాక్టివ్​ కేసుల కంటే కోలుకున్నవారు 3.5 రెట్లు అధికంగా ఉన్నారని పేర్కొంది. మొత్తం కేసుల్లో 21.87శాతం మంది చికిత్స పొందుతున్నారు. మరణాల రేటు 1.84 శాతంగా ఉందని తెలిపింది.

ఇదీ చూడండి: ప్రియాంకను తనతో పాటు రమ్మన్న మదర్ థెరిసా!

Last Updated : Aug 26, 2020, 9:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.