ETV Bharat / bharat

ఈనెల 12నుంచి పట్టాలెక్కనున్న మరో 80 రైళ్లు - new special trains news updates

సెప్టెంబరు 12 నుంచి ప్రయాణికుల సౌకర్యార్థం కొత్తగా 80 రైళ్లు పట్టాలెక్కనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. వీటికి సంబంధించి రిజర్వేషన్లు ఈ నెల 10 నుంచి ప్రారంభం కానున్నాయి.

80 new special trains to run from Sept 12: Rail Board Chairman
ఈ నెల 12 నుంచి పట్టాలెక్కనున్న మరో 80 రైళ్లు
author img

By

Published : Sep 5, 2020, 5:47 PM IST

ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్ల సంఖ్యను కేంద్రం పెంచింది. ఇప్పటికే నడుస్తున్న 230 ప్రత్యేక రైళ్లకు అదనంగా మరో 80 రైళ్లను నడపనున్నట్లు రైల్వే బోర్డు ఛైర్మన్​ వీకే యాదవ్​ తెలిపారు. ఈ నెల 12 నుంచి అందుబాటులోకి రానుండగా... సెప్టెంబర్‌10 నుంచి రిజర్వేషన్లు ప్రారంభం కానున్నాయి. వాటి వివరాలను, మార్గాలను త్వరలో వెల్లడిస్తామని రైల్వే ప్రకటించింది.

ఏ మార్గాల్లో వెయిటింగ్ లిస్ట్ ఎక్కువగా ఉంటే ఆ మార్గాల్లో రైళ్లను నడుపుతామని అధికారులు వెల్లడించారు. పరీక్షలు, ఇతర ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రాలు కోరితే ప్రత్యేక రైళ్లు నడుపుతామన్నారు.

ఏ రైళ్లలో వెయిటింగ్​ లిస్ట్​ అధికంగా ఉందో తెలుసుకోవడానికి ప్రస్తుతం నడుస్తున్న అన్ని రైళ్లను రైల్వేశాఖ పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: 'ప్రభుత్వానికి తక్కువ- ప్రైవేటీకరణకు ఎక్కువ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.