ETV Bharat / bharat

కేరళలో వరుసగా రెండో రోజూ 'సున్నా' కేసులు - corona cases in gujarath

దేశంలో కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న ముంబయి నగరంలో గడిచిన 24 గంటల్లో 510 మందికి వైరస్​ సోకింది. వీటితో కలిపి దేశ ఆర్థిక రాజధానిలో కొవిడ్​-19 మొత్తం కేసులు 9వేలకు దాటినట్లు అధికారులు వెల్లడించారు. తమిళనాడులో 527, గుజరాత్​లో 376, పంజాబ్​లో 132 మందికి ఇవాళ కొత్తగా వైరస్​ సోకింది. కేరళ, ఝార్ఖండ్​ రాష్ట్రాల్లో నేడు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

8 more test COVID-19 positive in Ghaziabad, total cases rise to 82
ఆ రాష్ట్రాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు
author img

By

Published : May 4, 2020, 9:19 PM IST

దేశంలో చాపకిందనీరులా విస్తరిస్తోంది కరోనా. ఇప్పటివరకు 42,836మందికి వైరస్ సోకింది. 1,389మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా మహారాష్ట్రలో వైరస్ కేసులు నమోదయ్యాయి. తర్వాతి స్థానాల్లో గుజరాత్, దిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు ఉన్నాయి.

ముంబయిలో మరో 510 మందికి కరోనా

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉద్ధృతి ఎక్కువగా ఉంది. గడిచిన 24 గంటల్లో ముంబయిలో 510 మందికి వైరస్​ సోకింది. ఒక్క దేశ ఆర్థిక రాజధాని నగరంలోనే మొత్తం 9,123 మంది బాధితులు ఉన్నట్లు ఆ రాష్ట్ర యంత్రాంగం ప్రకటించింది.

తమిళనాడులో మరో 527 కేసులు

తమిళనాడులో రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 527 మందికి వైరస్ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. వైరస్ బాధితుల సంఖ్య 3,550కి ఎగబాకినట్లు ఆ రాష్ట్ర యంత్రాంగం వెల్లడించింది. మొత్తంగా 31 మంది మహమ్మారికి బలయ్యారు. రాష్ట్రంలో లాక్​డౌన్​లో కొన్ని సడలింపులు ఇవ్వటం వల్ల చాలా రిటైల్​ షాపులు తెరుచుకున్నాయి. మే 7 నుంచి కంటైన్​మెంట్​ జోన్లలో మద్యం దుకాణాలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం.

గుజరాత్​లో మరో 376 కేసులు

గుజరాత్​లో కరోనా కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ మరో 376 మందికి వైరస్ పాజిటివ్​గా​ నిర్ధరణ అయింది. మొత్తం బాధితుల సంఖ్య 5,804కు చేరినట్లు అధికారులు తెలిపారు. తాజాగా 29 మంది మృతి చెందగా.. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 319 మంది వైరస్​కు బలయ్యారు. ఇవాళ ఒక్కరోజే 153 మంది డిశ్చార్జి కాగా.. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1195 మంది కోలుకున్నారు.

పంజాబ్​లో మరో 132 కేసులు

పంజాబ్​​లో నేడు మరో 132 వైరస్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 1,232మంది ప్రాణాంతక వైరస్​ బారిన పడినట్లు ఆ రాష్ట్ర అధికారులు ప్రకటించారు. కొత్తగా 23 మంది ప్రాణాలు కోల్పోయారు. 128 మందికి వైరస్​ నయమైంది.

రాజస్థాన్​​లో 3 వేలు దాటిన బాధితులు

రాజస్థాన్​లోనూ కరోనా బాధితులు పెరిగిపోతున్నారు. కొత్తగా 123 వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం 3,009 మంది కరోనా​ బారినపడ్డారు. మరో నలుగురు మృతి చెందగా.. మరణాల సంఖ్య 75కు పెరిగింది. 1356 మందిలో వైరస్ నయమైంది.

ఉత్తర్​ప్రదేశ్​లో 12 మంది సీఐఎస్​ఎఫ్​ జవాన్లకు కరోనా

ఉత్తర్​ప్రదేశ్​ గౌతమ్​ బుద్ధనగర్​లోని 12 మంది సీఐఎస్​ఎఫ్​ సిబ్బందికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. వీరితో కలిపి ఇవాళ మొత్తం 121 మంది మహమ్మారి బారినపడ్డారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 2,766 మందికి వైరస్​ సోకినట్లు ఆ రాష్ట్ర అధికారులు ప్రకటించారు. మొత్తంగా 754 మంది డిశ్చార్జి​ అయ్యారు. 50 మంది ప్రాణాలు కోల్పోయారు.

బంగాల్​ మరో 11 మంది మృతి

బంగాల్​లో ఇవాళ మరో 11 మంది మృతి చెందగా.. మొత్తం మరణించిన వారి సంఖ్య 61కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా మరో 61 కేసులు నమోదు కాగా... ఇప్పటి వరకు 1,259 మంది బాధితులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో మరో 72 ప్రాంతాలను కంటైన్​మెంట్​ జోన్లుగా ప్రకటించింది దీదీ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 516 జోన్లు ఉన్నట్లు తెలిపింది.

కర్ణాటకలో 26 మంది మృతి..

కర్ణాటకలో ఇవాళ మరో 28 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో మొత్తంగా 642 మందికి వైరస్​ సోకినట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 26 మంది మృతి చెందగా, 304 మంది ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు.

  • జమ్ముకశ్మీర్​లో మరో 25 మందికి వైరస్​ సోకగా మొత్తం 726 మంది బాధితులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కేసుల సంఖ్య పెరుగుతున్న కారణంగా యావత్​ కశ్మీర్​లోయ సహా జమ్ములోని మూడు జిల్లాలను రెడ్​జోన్లుగా ప్రకటించింది అక్కడి ప్రభుత్వ యంత్రాంగం. 303 మంది కోలుకున్నారు.
  • హిమాచల్​ప్రదేశ్​లో గత 11 రోజుల నుంచి ఒక్కరికి కూడా వైరస్​ సోకలేదని ఆ రాష్ట్ర యంత్రాంగం ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 41 కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం ఒక్కరు మాత్రమే చికిత్స పొందుతున్నట్లు ఆ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ఆర్​ డీ ధీమాన్​ తెలిపారు.
  • కేరళలో వరుసగా రెండో రోజు ఒక్కకేసు కూడా నమోదు కాలేదని అధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో 61 మంది వైరస్​ బారి నుంచి కోలుకోని డిశ్చార్జ్​ అయినట్లు తెలిపారు. రాష్ట్రంలో 34 మంది యాక్టివ్​ కేసులు ఉన్నాయి.
  • ఝార్ఖండ్​లో గత రెండు రోజుల నుంచి ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ఆ రాష్ట్ర యంత్రాంగం ప్రకటించింది. ఇప్పటి వరకు 115 మందికి వైరస్​ సోకగా.. 27 మంది డిశ్చార్జ్​ అయ్యారు.
  • ఒడిశాలో తాజాగా ఒక్క కేసు మాత్రమే నమోదయ్యింది. రాష్ట్రంలో వైరస్​ బారిన పడిన వారి సంఖ్య 163కు చేరుకుంది. ఈ రోజు మొత్తం 3 వేల మంది వలస కార్మికులు కేరళ, గుజరాత్​ నుంచి రాష్ట్రానికి చేరుకున్నట్లు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.