ETV Bharat / bharat

దిల్లీలోనూ 'దొంగ కరోనా' కేసులు- 75% అవే!

దిల్లీలో నమోదైన కరోనా కేసుల్లో లక్షణాలు కనబడని, స్వల్ప అనారోగ్యానికి గురైనవారే 75 శాతం మంది ఉన్నారని వెల్లడించారు ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​. ఆస్పత్రుల్లో చేరని వారికి ఇంటివద్దనే చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

COVID-19
కరోనా కేసుల్లో 75 శాతం లక్షణాలు బయటపడనివారే!
author img

By

Published : May 10, 2020, 3:28 PM IST

దేశ రాజధాని దిల్లీలో నమోదైన మొత్తం కరోనా కేసుల్లో 75 శాతం కేసులు లక్షణాలు బయటపడని, స్వల్ప అనారోగ్యానికి గురైనవే ఉన్నట్లు ముఖ్యమంత్రి అరవిద్​ కేజ్రీవాల్​ తెలిపారు. ప్రభుత్వ అధీనంలోని అంబులెన్స్​ల కొరత నేపథ్యంలో ప్రైవేటు ఆస్పత్రుల అంబులెన్స్​లను వినియోగించేందుకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.

కరోనా పరిస్థితులపై ఆన్​లైన్ ద్వారా​ మీడియాతో మాట్లాడారు కేజ్రీవాల్​.

" ప్రభుత్వానికి ప్రైవేటు అంబులెన్స్​లు అవసరమైనప్పుడు వాటి సేవలను అందుబాటులోకి తేవాల్సి ఉంటుంది. కేంద్రం మార్గదర్శకాలను అనుసరించి కరోనాతో స్వల్ప అనారోగ్యానికి గురై ఇళ్లల్లో ఉన్నవారికి వైద్యం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దిల్లీలో మొత్తం 6,923 మంది రోగుల్లో 1,476 మాత్రమే ఆస్పత్రిలో చేరారు. మిగిలిన వారికి ఇంటివద్ద, కొవిడ్​-19 కేంద్రాల వద్ద చికిత్స అందిస్తాం."

– అరవింద్​ కేజ్రీవాల్​, దిల్లీ ముఖ్యమంత్రి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.