ETV Bharat / bharat

73 రాజ్యసభ స్థానాలకు ఈ ఏడాదే ఎన్నికలు

ఈ ఏడాది 73 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 69 మంది పదవీ కాలం పూర్తి కానుండగా.. మరో నాలుగు స్థానాలు ఇప్పటికే ఖాళీగా మారాయి. ఈ నేపథ్యంలో సభ్యులను ఎన్నుకునేందుకు అవకాశం ఉందని తెలుస్తోంది.

author img

By

Published : Jan 4, 2020, 6:53 AM IST

Updated : Jan 4, 2020, 9:41 AM IST

73 Rajya Sabha seats to see election this year, maximum held by BJP
ఈ ఏడాదిలో 73 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
73 రాజ్యసభ స్థానాలకు ఈ ఏడాదే ఎన్నికలు

పెద్దల సభ అయిన రాజ్యసభలో 73 స్థానాలకు ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత సభ్యుల్లో 69 మంది పదవీ కాలం ఈ ఏడాదే పూర్తికానుందని.. రాజ్యసభ సచివాలయం విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మరో నాలుగు సీట్లు ఇప్పటికే ఖాళీగా మారాయి. పదవీకాలం పూర్తికానున్న వారిలో భాజపా నుంచి 18 మంది, కాంగ్రెస్​ నుంచి 17 మంది సభ్యులుగా ఉన్నారు. కేంద్ర మంత్రులు హర్దీప్​ సింగ్​ పూరి, రామ్​దాస్​ అథవాలేలతో పాటు సీనియర్ నేతలు శరద్​ పవార్​, దిగ్విజయ్​ సింగ్​, విజయ్​ గోయల్ ఈ జాబితాలో​ ఉన్నారు.

రాజ్యసభలో మెజారిటీ దిశగా భాజపా పయనిస్తున్న నేపథ్యంలో 2018- 19 సంవత్సరాల్లో పలు శాసనసభ ఎన్నికల్లో ఓటమి కమలం పార్టీకి అవాంతరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కారణంగా ఎలాంటి అదనపు ప్రయోజనం భాజపాకు వచ్చే అవకాశం కన్పించడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో కాంగ్రెస్​ కూటమి పార్టీలు ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో మెరుగయ్యాయి. ఈ నేపథ్యంలో రానున్న రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ సహా మిత్రపక్ష పార్టీలకు లాభించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రాజ్యసభలోని 250 మంది సభ్యుల్లో భాజపా నుంచి 83 మంది, కాంగ్రెస్​ నుంచి 46 మంది​ సభ్యులు ఉన్నారు.

యూపీలో మెజారిటీ స్థానాలు భాజపావే..

ఉత్తర్​ప్రదేశ్​ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో 10మంది సభ్యుల పదవీకాలం ఈ ఏడాది తీరనుంది. రాష్ట్రంలో కమలం పార్టీకి మెజారిటీ ఉన్న నేపథ్యంలో ఎక్కువ శాతం భాజపా సొంతం చేసుకొనే అవకాశం ఉంది. రాజస్థాన్​, మధ్యప్రదేశ్​, ఝార్ఖండ్​, మహారాష్ట్రల్లో కాంగ్రెస్​కు మెజారిటీ ఉన్న కారణంగా ఆయా రాష్ట్రాల్లో హస్తం పార్టీకి లాభించే అవకాశం ఉంది.

ఏ రాష్ట్రాల్లో ఎన్ని స్థానాలు..

ఈ ఏడాది ఉత్తర్​ప్రదేశ్​లో 10, మహారాష్ట్ర నుంచి 7, తమిళనాడు 6, బంగాల్​, బిహార్​ రాష్టాల నుంచి 5 సీట్ల చొప్పున ఖాళీ అవనున్నాయి. ఆంధ్రప్రదేశ్​, గుజరాత్​, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి 4 సభ్యుల చొప్పున పదవీ కాలం తీరనుంది. మధ్యప్రదేశ్​లో 3 స్థానాలకు, తెలంగాణ, హరియాణా, ఝార్ఖండ్​, ఛత్తీస్​గఢ్​ రాష్ట్రాల్లో రెండేసి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీ చూడండి: ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్​ భారత పర్యటన రద్దు

New Delhi, Jan 04 (ANI): President Ram Nath Kovind met achievers from across the country at Rashtrapati Bhavan in Delhi on January 03. President Kovind also interacted with all them of who have done commendable work in various fields - science and innovation, sports, empowerment of divyang persons, farming and afforestation, women and child empowerment, education, healthcare, revival of old art forms and others. Sprinter Dutee Chand, who is the fastest Indian woman and has won many medals for the country, also met the President. President Kovind lauded their contribution and called them true nation builders. The President also urged them to continue their good work.

Last Updated : Jan 4, 2020, 9:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.