ETV Bharat / bharat

'అంపన్' మిగిల్చిన విషాదం- 72 మంది మృతి

author img

By

Published : May 21, 2020, 4:49 PM IST

Updated : May 21, 2020, 7:16 PM IST

amphan telugu news
అంపన్ తెలుగు

19:05 May 21

అంపన్ తుపాను బంగాల్​​లో పెను విధ్వంసం సృష్టించింది. తుపాను బీభత్సానికి బంగాల్​లో 72 మంది మరణించినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షల పరిహారం అందించనున్నట్లు ప్రకటించారు.

అంపన్ తీవ్రత కరోనా కంటే దారుణంగా ఉందని వ్యాఖ్యానించారు మమత. కోల్​కతాతో పాటు మరో రెండు జిల్లాల్లోనూ తుపాను అల్లకల్లోలం సృష్టించినట్లు తెలిపారు. వంతెనలు, విద్యుత్ తీగలు పూర్తిగా నాశనం అయ్యాయన్నారు. పునర్నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభించనున్నట్లు మమత స్పష్టం చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సందర్శించాలని ప్రధాని మోదీని కోరారు.

"ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో తుపాను కారణంగా 72 మంది మృతి చెందారు. దక్షిణ, ఉత్తర 24 పరగణాల జిల్లాలు పూర్తిగా నాశనమయ్యాయి. ఈ రెండు జిల్లాలను మళ్లీ మొదటి నుంచి నిర్మించాల్సి ఉంటుంది. అన్ని విధాలా సాయం అందించాలని కేంద్రాన్ని కోరుతున్నా. తుపాను ప్రభావిత ప్రాంతాలను త్వరలోనే సందర్శిస్తా. ఈ ప్రాంతాల్లో ప్రధాని మోదీ సైతం పర్యటించాలని విజ్ఞప్తి చేస్తున్నా."

-మమతా బెనర్జీ, పశ్చిమ్ బంగ ముఖ్యమంత్రి

ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, కోల్​కతాతో పాటు తూర్పు మిడ్నాపుర్​, హావ్​డా జిల్లాలను సైతం తుపాను కోలుకోలేని దెబ్బతీసింది. గత వందేళ్లలో బంగాల్​ను తాకిన అతి భయంకరమైన తుపానుగా అంపన్​ను అభివర్ణిస్తున్నారు అధికారులు. తుపాను ధాటికి వందలాది మంది నిరాశ్రయులు అయినట్లు అంచనా వేస్తున్నారు. ప్రత్యక్షంగా 44.8 లక్షల మందిపై తుపాను తీవ్ర ప్రభావం చూపిందని అధికారులు చెబుతున్నారు. మొత్తం ఎంతమంది మరణించారనే విషయం ఇప్పుడే చెప్పడం వీలుకాదన్నారు.

కూలిన 1000 టవర్లు!

అంపన్ ప్రభావానికి వందలాది చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. వేలాది కార్లు ధ్వంసమయ్యాయి. ప్రచండమైన గాలులకు టవర్లు సైతం కూలిపోవడం వల్ల సమాచార వ్యవస్థ నాశనమైంది. దాదాపు వెయ్యి టవర్లు కూలిపోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కీలకమైన రహదారులపై భారీ వృక్షాలు నేలకొరగడం వల్ల వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఒడిశాలో టెలికాం వ్యవస్థ అస్తవ్యస్థంగా మారింది.

ప్రధాని సానుభూతి

తుపాను ధాటికి తీవ్రంగా నష్టపోయిన బంగాల్​ పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సానూభూతి వ్యక్తం చేశారు. కేంద్రం తరఫున అవసరమైన సాయం అందిస్తామని వెల్లడించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో దేశం మొత్తం బంగాల్​కు మద్దతుగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రజల క్షేమం కోసం ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఉన్నత అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారన్నారు. ఒడిశా ప్రజలకు సైతం సంఘీభావం ప్రకటిస్తున్నట్లు చెప్పారు.

హోంమంత్రి

తుపాను ప్రభావిత రాష్ట్రాలైన బంగాల్, ఒడిశా ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్​లో మాట్లాడారు. పరిస్థితి నుంచి గట్టెక్కడానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని భరోసా ఇచ్చారు.

మరో నాలుగు ఎన్​డీఆర్​ఎఫ్ బృందాలు

ఈ నేపథ్యంలో బంగాల్​ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు అదనపు ఎన్​డీఆర్​ఎఫ్ బృందాలను ఆ రాష్ట్రానికి తరలిస్తున్నారు. భారత వాయుసేన విమానంలో మరో నాలుగు బృందాలను కోల్​కతాకు పంపినట్లు ఎన్​డీఆర్​ఎఫ్ చీఫ్ ఎస్ఎన్​ ప్రధాన్ వెల్లడించారు. రాత్రి 8:30 గంటలకు ఈ బృందాలు కోల్​కతాకు చేరుకుంటాయని చెప్పారు. ఒడిశాలో మరో రెండు రోజుల్లో సాధారణ జీవనం ప్రారంభమవుతుందని ప్రధాన్ అంచనా వేశారు. అయితే తీవ్రంగా నష్టపోయిన బంగాల్​లో సాధారణ పరిస్థితులకు మరింత సమయం పట్టే అవకాశం ఉందన్నారు.

వందేళ్లలో భయంకరమైనది ఇదే

గత వందేళ్లలో సంభవించిన అత్యంత భయంకరమైన తుపాను ఇదేనని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ప్రస్తుతం తుపాను పూర్తిగా బలహీనపడిందని స్పష్టం చేసింది.

ప్రాణనష్టం తక్కువే!

బంగాల్, ఒడిశాల్లో చేపట్టిన సహాయక చర్యలపై నేషనల్ క్రైసిస్ మేనేజ్​మెంట్ కమిటీ(ఎన్​సీఎంసీ) దిల్లీలో సమీక్ష నిర్వహించింది. వాతావారణ శాఖ ఇచ్చిన కచ్చితమైన సమాచారం ద్వారా చాలా వరకు ప్రాణనష్టాన్ని ఆపగలిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఒడిశాలో 1999లో సంభవించిన సూపర్ సైక్లోన్​తో పోలిస్తే ప్రాణ, ఆస్తి నష్టం తక్కువేనని స్పష్టం చేశారు.

ఐఎండీ హెచ్చరికలకు అప్రమత్తమై బంగాల్​లో 5 లక్షలు, ఒడిశాలో 2 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. ముందుగానే ఎన్​డీఆర్​ఎఫ్​ సిబ్బందిని మోహరించడం కూడా ప్రాణనష్టాన్ని నిలువరించడానికి ఉపయోగపడినట్లు స్పష్టం చేశారు.

పునరుద్ధరణ చర్యలు

రెండు రాష్ట్రాల్లోనూ సేవలను పునరుద్ధరించడానికి విద్యుత్, టెలికాం మంత్రిత్వ శాఖలు చర్యలు ముమ్మరం చేశాయి. రైల్వే సైతం భారీ నష్టాన్ని చవిచూసింది. అన్ని రూట్లను.. సేవలను పునఃప్రారంభించడానికి సిద్ధం చేయనున్నట్లు తెలిపింది.

16:47 May 21

అంపన్​ బీభత్సానికి బంగాల్​లో 72 మంది బలి

అంపన్ తుపాను బంగాల్​లో పెను బీభత్సం సృష్టించింది. ఏకంగా 72 మందిని బలిగొంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ విషయం వెల్లడించారు. మృతుల కుటుంబసభ్యులకు రూ.2-2.5 లక్షల పరిహారం అందిస్తామని ప్రకటించారు. 

Last Updated : May 21, 2020, 7:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.