విశాఖ గ్యాస్ లీక్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుండగా ఛత్తీస్‌గఢ్‌లోనూ ఇదే తరహా ఘటన జరిగింది. రాయ్‌గఢ్ జిల్లా తెత్లా ప్రాంతంలోని ఓ పేపర్ మిల్లులో విషవాయువు కారణంగా ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. నిరుపయోగంగా పడి ఉన్న ఓ ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు వెళ్లడమే ఘటనకు కారణంగా తెలుస్తోంది. చాలా కాలం నుంచి ఉపయోగించని కారణంగా అక్కడ విషవాయువులు తయారయ్యాయని సమాచారం.
రాయ్‌గఢ్ ఎస్పీ సంతోష్ సింగ్, కలెక్టర్ యశ్వంత్ కుమార్ బాధితులు చికిత్స పొందుతున్న ఆసుపత్రిని సందర్శించారు. మిల్లు యజమాని.. ఘటనను అధికారుల దృష్టికి రాకుండా చర్యలు తీసుకున్నాడని, యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.