ETV Bharat / bharat

పాక్​ చెర నుంచి భారత్​ చేరి గుండెపోటుతో మృతి! - 18 ఏళ్ల తర్వాత భారత్​కు తిరిగొచ్చిన వృద్ధురాలు

18 ఏళ్ల తర్వాత పాక్​ చెరనుంచి విముక్తి పొంది భారత్​కు తిరిగొచ్చింది ఆ వృద్ధురాలు. స్వదేశానికి తిరిగి వచ్చిందన్న ఆనందం ఆవిరవడానికి ఎన్నోరోజులు పట్టలేదు ఆమె కుటుంబానికి. గుండెపోటుతో మహారాష్ట్రలోని ఔరంగాబాద్​లో ఆ వృద్ధురాలు చనిపోయింది.

65-year-old woman freed from Pakistani jail, returns to Aurangabad died today
18 ఏళ్ల తర్వాత పాక్​ చెర నుంచి విముక్తైన వృద్ధురాలు మృతి
author img

By

Published : Feb 9, 2021, 4:57 PM IST

పాక్​ చెర నుంచి విముక్తి పొంది 18 ఏళ్ల తర్వాత భారత్​ చేరిన వృద్ధురాలు హసీనా బేగమ్ గుండె పోటుతో మహారాష్ట్రలోని ఔరంగాబాద్​లో చనిపోయింది. ఆమె తిరిగొచ్చిందన్న ఆనందం కుటుంబ సభ్యులకు ఎంతోకాలం నిలువలేదు.

అసలు ఏం జరిగింది..?

మహారాష్ట్రలోని ఔరంగబాద్​కు చెందిన 65 ఏళ్ల హసీనా బేగమ్​ 18 ఏళ్ల క్రితం ఆమె భర్త బంధువులను కలుసుకునేందుకు పాకిస్థాన్​కు వెళ్లింది. లాహోర్​లో ఆమె పాస్​పోర్ట్​ పోగొట్టుకుంది. పాస్​పోర్ట్​ లేని కారణంగా హసీనాకు పాకిస్థాన్ జైలు శిక్ష విధించింది.

ఔరంగాబాద్​ పోలీసుల నివేదిక

హసీనా నిర్దోషి అని రుజువు కావడానికి భారత్​ నుంచి పాకిస్థాన్​ సమాచారం కోరింది. దీనిపై ఔరంగబాద్​ పోలీసులు పాక్​కు వివరాలు వెల్లడించడం వల్ల హసీనాను గత వారం పాక్​ భారత్​కు అప్పగించింది. సిటీ చౌక్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఆమె పేరున ఇల్లు ఉందని ఔరంగబాద్​ పోలీసులు నివేదికలో పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 80 అడుగుల బావిలో పడి.. ప్రాణాలతో బయటకు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.