ETV Bharat / bharat

దేశంలో 65.28 లక్షల మందికి వ్యాక్సినేషన్​ - COVID IN INDIA

దేశంలో ఇప్పటివరకు 65.28 లక్షల మందికి టీకా అందించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కొవిడ్​ వ్యాక్సినేషన్​లో భాగంగా దేశంలో తొలుత ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్​లైన్​ వర్కర్లకు వ్యాక్సిన్​ ఇస్తున్నారు.

65.28 lakh heathcare, frontline workers received COVID-19 vaccine doses till now
దేశంలో 65.28 లక్షల మందికి వ్యాక్సినేషన్​
author img

By

Published : Feb 9, 2021, 10:21 PM IST

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్​ ప్రక్రియ వేగంగా సాగుతోందని తెలిపింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. మంగళవారం వరకు టీకా తీసుకున్న వారి సంఖ్య 65.28 లక్షలకు చేరిందని స్పష్టం చేసింది. ఇవాళ ఒక్కరోజే దాదాపు 2.70 లక్షల మందికి వ్యాక్సిన్​ ఇచ్చినట్లు పేర్కొంది. ఇందులో 55 లక్షల మందికిపైగా ఆరోగ్య కార్యకర్తలు, 9 లక్షల మందికిపైగా ఫ్రంట్​లైన్​ వర్కర్లు అని వెల్లడించింది.

మంగళవారం.. ఉత్తర్​ప్రదేశ్​ తప్ప మిగతా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వ్యాక్సినేషన్​ కొనసాగిందని తెలిపింది.

25వ రోజు వ్యాక్సినేషన్​లో భాగంగా.. 25 మందిలో స్వల్పంగా ప్రతికూల ప్రభావాలు కనిపించినట్లు కేంద్రం పేర్కొంది. 24 రోజుల్లోనే దేశంలో 60 లక్షల మందికి టీకా ఇచ్చామని.. వేగంగా ఈ ఘనత అందుకున్న దేశంగా భారత్​ నిలిచిందని వెల్లడించింది.

వ్యాక్సినేషన్​ ప్రక్రియలో భాగంగా.. తొలుత కరోనాపై పోరాడిన ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్​ లైన్​ వర్కర్లకు టీకా ఇస్తున్నారు.

ఇదీ చూడండి: 'భారత్​లో అటువంటి వైరస్​ ఏం లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.