ETV Bharat / bharat

642 శ్రామిక్​ రైళ్లల్లో 8లక్షలమంది ప్రయాణం

కరోనా సంక్షోభంతో లాక్​డౌన్​ అమలు చేసింది కేంద్రం. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల కోసం మే 1 నుంచి ప్రత్యేక శ్రామిక్ రైళ్లను ప్రారంభించింది. ఇప్పటివరకు 642రైళ్లలో 8లక్షల మందిని స్వస్థలాలకు చేరవేసినట్లు రైల్వేశాఖ వెల్లడించింది.

642 'Shramik Special' trains run so far, around 8 lakh migrants ferried home
642 శ్రామిక్​ రైళ్లు... 8లక్షలమంది ప్రయాణం
author img

By

Published : May 13, 2020, 10:22 PM IST

లాక్​డౌన్​ కారణంగా వలస కార్మికులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. వారిని స్వస్థలాలకు చేరవేసేందుకు 'శ్రామిక్'​ పేరుతో ప్రత్యేక రైళ్లను ప్రారంభించింది కేంద్రం. మే 1 నుంచి ఇప్పటివరకు 642 శ్రామిక్​ రైళ్లలో 8లక్షల మందిని స్వస్థలాలకు చేరవేసినట్లు అధికారుల తెలిపారు. ఇందులో అత్యధికంగా 301రైళ్లు ఉత్తరప్రదేశ్​కు చేరగా...169 రైళ్లతో బిహార్​ ఆ తర్వాతి స్థానంలో ఉన్నట్లు వెల్లడించారు.

ఏ రాష్ట్రానికి ఎన్ని?

మధ్యప్రదేశ్​కు 53, ఝార్ఖండ్​కు 40, ఒడిశాకు 38, రాజస్థాన్​కు​ 8, బంగాల్​కు 7, ఛత్తీస్​గఢ్ 6, ఉత్తరాఖండ్​కు 4 ప్రత్యేక రైళ్లు నడిపినట్లు అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్​, జమ్ముకశ్మీర్​, మహారాష్ట్రలకు 3 రైళ్లు చొప్పున ప్రయాణించినట్లు చెప్పారు. తెలంగాణ, తమిళనాడు, మిజోరం, మణిపూర్​, త్రిపుర, కర్ణాటక, హిమాచల్​ ప్రదేశ్​లకు ఒక్క రైలు మాత్రమే నడిచినట్లు రైల్వేశాఖ వివరించింది.

రోజు 100 రైళ్లు..

ప్రయాణికులందరికి రైళ్లు ఎక్కే ముందు స్క్రీనింగ్​ పరీక్షలు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణ సమయంలో ఉచిత భోజనం, తాగు నీరు సౌకర్యాన్ని కల్పించామని వెల్లడించారు. సోమవారం నుంచి శ్రామిక్ రైళ్లలో 1700మంది ప్రయాణికులను అనుమతిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రోజుకు 100శ్రామక్​ రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే, హోంశాఖ సంయుక్తంగా ప్రకటించాయి.

ఇదీ చూడండి: 'నల్లకోటుతో కాదు.. తెల్లచొక్కాతోనే విచారణ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.