ETV Bharat / bharat

ఆరేళ్ల బాలుడు ఆస్పత్రిలో స్ట్రెచర్​ తోస్తూ...

author img

By

Published : Jul 22, 2020, 2:14 PM IST

ముప్పై రూపాయలు... చెప్పుకోవడానికి తక్కువే అనిపించినా.. పేదవాళ్లకు అదే ఎక్కువ. ఆసుపత్రిలో రోగిని వార్డు మార్చేందుకు అక్కడి సిబ్బందికి రూ. 30 ఇవ్వలేని ఓ మహిళ... తన ఆరేళ్ల కుమారుడి సాయంతో ఆమె తండ్రిని స్ట్రెచర్​పై ఉంచి తోసుకెళ్లింది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయింది.

6 years old seen pushing grandfather's stretcher in hospital
ఆరేళ్ల బుడతడు స్ట్రెచర్​ను తోసుకుంటూ..!

ముద్దు ముద్దు మాటలు చెబుతూ అప్పుడే బడికెళ్లాల్సిన వయసది. కానీ, ఓ ఆరేళ్ల బాలుడు.. అనారోగ్యంతో ఉన్న తన తాతయ్యను ఆసుపత్రిలో వార్డు మార్చేందుకు స్వయంగా స్ట్రెచర్​ను తోసుకుంటూ వెళ్లాడు. వార్డు బాయ్​ ఇందుకు రూ. 30 వసూలు చేస్తుండటమే కారణం.

తల్లి సాయంతో తన తాతయ్యను స్ట్రెచర్​పై తోసుకెళ్తున్న ఆరేళ్ల బాలుడు

తల్లి సాయంతో..

ఉత్తర్​ప్రదేశ్​ బర్హజ్​ ప్రాంతంలోని గౌరా గ్రామానికి చెందిన చెడీ యాదవ్​ ఇటీవల గాయపడ్డాడు. అతడి కూతురు, మనుమడు దేవరియా జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు సర్జికల్​ వార్డులో చేర్పించాలని సూచించారు. వార్డు మార్చేందుకు ఆస్పత్రి సిబ్బందికి రూ.30 ఇవ్వలేక.. తల్లి సాయంతో స్ట్రెచర్​ను తోసుకుంటూ వెళ్లాడు ఆ ఆరేళ్ల బాలుడు. ఈ దృశ్యాన్ని అక్కడివారు తమ చరవాణుల్లో చిత్రీకరించారు.

ఈ వీడియో వైరల్​ కావడంవల్ల.. దేవరియా జిల్లా కలెక్టర్​ స్పందించారు. ఇందుకు కారణమైన ఆ వార్డు బాయ్​ని తక్షణమే విధుల నుంచి తొలగించారు. సమగ్ర దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఇదీ చదవండి: లేహ్​ నుంచి దిల్లీకి ఆకాశమార్గాన అమృత ధారలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.