గిన్నిస్ రికార్డులో చోటు కోసం అద్భుతం చేశాడు పంజాబ్‌కు చెందిన ఆరేళ్ల బుడతడు. కళ్లకు గంతలు కట్టుకొని 16 కిలోమీటర్లు స్కేటింగ్ చేశాడు. ప్రణవ్ చౌహాన్ చేసిన ఈ సాహసానికి లుధియానాలోని లేయర్ వ్యాలీ స్కేటింగ్ స్టేడియం వేదికైంది.
ఈ ఫీట్‌ను సాధించడానికి గంటా 16 నిమిషాల సమయం తీసుకున్నాడు ప్రణవ్. అయితే ఆ బాలుడి ప్రయత్నాన్ని గిన్నిస్ అధికారులు ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది.
ఇప్పటివరకు ఈ విభాగంలో 14 కిలోమీటర్లు మాత్రమే స్కేటింగ్ రికార్డ్‌గా ఉండగా.. ప్రణవ్ దాన్ని తిరగరాశాడని అతడి తండ్రి సురిందర్ కుమార్ తెలిపారు. ఈ వివరాలను గిన్నిస్ అధికారులకు పంపుతామని ఆయన అన్నారు. ఈ రికార్డు కోసం మూడున్నరేళ్ల నుంచి సాధన చేస్తున్నాడని పేర్కొన్నారు సురిందర్.
ఇదీ చదవండి: మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం- ఆపై గొంతు కోసి..