భారత్-పాక్ సరిహద్దుల్లో భారీ భూకంపం సంభవించింది. ఉత్తర భారత దేశంలోని దిల్లీ, పంజాబ్, హరియాణాలోనూ భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.3గా నమోదైందని జాతీయ భూకంప విజ్ఞాన కేంద్రం వెల్లడించింది.
భూకంపం వల్ల ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగలేదని అధికారులు తెలిపారు.
"భూకంప కేంద్రం భారత్-పాక్ సరిహద్దుకు సమీపంలో ఉంది. దీనికి దగ్గరగా ఉన్న నగరం రావల్పిండి ( పాకిస్థాన్ పంజాబ్ రాష్ట్రం)"
- గౌతమ్, ఎన్సీఎస్ కార్యనిర్వణాధికారి
గజగజ వణికారు..
భూ ప్రకంపనలకు భయపడి జమ్ము కశ్మీర్, పంజాబ్, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్ ప్రజలు ఇళ్లు, కార్యాలయాలు వదిలి వీధుల్లోకి పరుగులు తీశారు.
పర్వత నగరంలో భూకంపం
పాకిస్థానీ పంజాబ్‌లోని పర్వత నగరమైన జెహ్లం సమీపంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.8గా నమోదైందని పాక్ వాతావరణశాఖ తెలిపింది. అయితే పాక్ విజ్ఞాన శాస్త్ర మంత్రి ఫవాద్ చౌదరి మాత్రం భూకంప తీవ్రత 7.1గా ఉందని ప్రకటించారు.
ఇదీ చూడండి: పాక్‌లో భూకంపం - ఇద్దరు మృతి, 100 మందికి గాయాలు