ETV Bharat / bharat

చెరువును తలపిస్తున్న ముంబయి విమానాశ్రయం - ఛత్రపతి శివాజీ విమానాశ్రయం

మహారాష్ట్రను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రాష్ట్రంలోని నదులు, వాగులు ఉప్పొంగి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంత ప్రజలను తలించేందుకు వైమానిక దళం, ఎన్​డీఆర్​ఎఫ్​, భారత సైన్యం రంగంలోకి దిగాయి. ముంబయిలోని ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలోకి వరద నీరు చేరి విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది.

చెరువును తలపిస్తున్న ముంబయి విమానాశ్రయం
author img

By

Published : Aug 4, 2019, 5:50 PM IST

Updated : Aug 4, 2019, 8:57 PM IST

చెరువును తలపిస్తున్న ముంబయి విమానాశ్రయం
ఎడతెరపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాలకు మహారాష్ట్ర కుదేలవుతోంది. రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, గ్రామాలను వరద ముంచెత్తుతోంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నాసిక్​ వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. గంగాపుర్​ జలాశయం నుంచి 20 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయగా... దిగువనున్న ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి.

కల్యాణ్​ దోంబివిల్​, భీవండి, ఉల్హాస్​, ఠాణె, రాజ్​గడ్​ వంటి నగరాలు, పరిసర గ్రామాలు నీట మునిగాయి. పడవలు, ద్వారా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

రంగంలోకి ఎమ్​ఐ-17 హెలికాఫ్టర్​...

మహారాష్ట్ర ప్రభుత్వం వినతి మేరకు భారత వైమానిక దళం ఎమ్​ఐ-17 హెలికాఫ్టర్​ను సహాయ చర్యలకు ఉపయోగిస్తోంది. నావికా దళానికి చెందిన మూడు బృందాలు రంగంలోకి దిగాయి. సైన్యానికి చెందిన మరో 120 మందిని మహారాష్ట్రకు తరలిస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న సుమారు 58 మందిని భారత వైమానిక దళం అధికారులు వాయుమార్గం ద్వారా సురక్షిత ప్రాంతానికి తరలించారు.

వరదలో ముంబయి విమానాశ్రయం...

దేశ ఆర్థిక రాజధాని ముంబయిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రవాణా వ్యవస్థ స్తంభించింది. పట్టాలపై నీరు చేరి పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ముంబయిలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా వరద నీరు చేరి విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది.

పుణెలో 500 కుంటుంబాల తరలింపు...

భారీ వర్షాలకు మహారాష్ట్రలోని రెండో ప్రధాన నగరం పుణెను వరదలు ముంచెత్తాయి. ముథ నది ఉప్పొంగి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. పుణె పరిధిలోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. పరిసర గ్రామాల్లోని సుమారు 500 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఇదీ చూడండి: వరుణ బీభత్సం- మహారాష్ట్ర, గుజరాత్​ జలదిగ్బంధం

AP Video Delivery Log - 1000 GMT News
Sunday, 4 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0938: France Flying Man AP Clients Only 4223544
French inventor Franky Zapata crosses Channel
AP-APTN-0937: US TX El Paso Families AP Clients Only 4223547
Families trying to locate missing loved ones
AP-APTN-0934: Hong Kong Protests AP Clients Only 4223546
Opposition demonstrators gather for more protests
AP-APTN-0917: US OH Shooting 2 MANDATORY CREDIT WKEF, NO ACCESS DAYTON MARKET, NO USE US BROADCAST NETWORKS 4223543
Police: 9 killed in mass shooting in Dayton
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Aug 4, 2019, 8:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.