ఓ మహిళ కడుపు నుంచి 57 కిలోల కణితిని తొలగించిన ఘటన ఒడిశా ఖుర్దా జిల్లాలో జరిగింది. కణితిని శస్త్ర చికిత్స ద్వారా వైద్యులు తొలగించారు. ఇంత భారీ కణితిని తొలగించడం ఇదే తొలిసారి కావచ్చేమో అభిప్రాయపడ్డారు వైద్యులు.
ఐదు గంటల ఆపరేషన్
నబరంగ్పుర్ జిల్లా ఫుల్మతి నాయక్‌కు చెందిన ఓ మహిళ పదేళ్లుగా కణితితో బాధపడుతుంది. ఆర్థిక ఇబ్బందులు కారణంగా వైద్యం చేయించుకోలేదు. అయితే కొన్ని రోజులుగా విపరీతంగా కడుపు నొప్పి రావడం వల్ల ఖుర్దా జిల్లాలోని సాయి సేవా సదన్ ఆసుపత్రిలో చేరింది. డాక్టర్ జగదీశ్ నేతృత్వంలోని వైద్యుల బృందం ఐదు గంటల పాటు శ్రమించి... ఎంతో నైపుణ్యంతో 57 కిలోల భారీ కణితిని తొలగించింది.
ఇదీ చూడండి: పుడమి తల్లికి సున్నం- గుంతలతో అపార నష్టం