ETV Bharat / bharat

కేరళలో కరోనా పంజా- మిగతా రాష్ట్రాల్లో తగ్గుముఖం - Covid-19 cases in Kerala

దేశంలో కొవిడ్​ ప్రభావం తగ్గుతున్నట్లు కేంద్రం అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే కేరళలో మాత్రం కొవిడ్​ కేసులు పెరుగుతున్నాయి. తమిళనాడు, ఉత్తర్​ప్రదేశ్​ సహా కొన్ని రాష్ట్రాల్లో కరోనా విస్తరణ కొనసాగుతోంది.

5,457 new #COVID19 cases reported in Kerala, taking the state's active patients to 92,161
దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుతోంది: కేంద్రం
author img

By

Published : Oct 27, 2020, 8:00 PM IST

దేశంలో కొవిడ్​ కేసుల సంఖ్య తగ్గుతోంది. అయితే కేరళలో మాత్రం కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఒక్కరోజే 5,457 మంది వైరస్ బారిన పడ్డారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 3 లక్షల 90 వేలకు చేరువైంది.

corona cases
కరోనా కేసుల వివరాలు

తమిళనాడులో కొత్తగా 2,522 మందికి కరోనా సోకగా... మరో 27 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7 లక్షల 14 వేలు దాటింది. 6 లక్షల 75 వేల మందికి పైగా కరోనా జయించారు.

  • ఉత్తర్​ప్రదేశ్​లో తాజాగా 2,018 కేసులు నమోదయ్యాయి. మరో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 4 లక్షల 74 వేలు దాటింది.
  • ఒడిశాలో కొత్తగా 1,247 మందికి వైరస్​ పాజిటివ్​గా తేలగా... మరో 13 మంది కొవిడ్​కు బలయ్యారు.
  • కేంద్రమంత్రి రాందాస్ అథవాలేకు కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. దీంతో ఆయన ముంబయిలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరినట్లు అధికారులు తెలిపారు.

11 వారాల్లో అత్యల్పం..

దేశంలో యాక్టివ్​ కేసుల సంఖ్య 6.25 లక్షలకు చేరుకుందని... 11 వారాల్లో ఇదే అత్యల్పమని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కేసులోడ్​ 7.88కు తగ్గింది. 18 జిల్లాల్లోనే 35 శాతం యాక్టివ్​ కేసులు ఉన్నట్లు వెల్లడించింది. 90.62శాతం మంది కొవిడ్​ నుంచి కొలుకున్నారు.

రోజువారి నమోదవుతున్న కేసులతో పాటు మరణాలు తగ్గడం వల్ల మరణాల రేటు 1.50 తగ్గినట్లు మంత్రిత్వశాఖ పేర్కొంది.

ఇదీ చూడండి: దేశ ఆర్థిక స్థితిపై ప్రధాని మోదీ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.