ETV Bharat / bharat

'50 శాతం మంది జీవన ప్రమాణాల్లో క్షీణత' - కరోనా వైరస్​

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ బడ్జెట్​ ప్రవేశపెట్టిన అనంతరం దేశంలో ఓ మీడియా సంస్థ సర్వే చేపట్టింది. 'గతేడాది కాలంలో మీ జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి?' అన్న ప్రశ్నకు 50శాతానికిపైగా మంది 'క్షిణించింది' అనే సమాధానం ఇచ్చినట్టు వెల్లడించింది.

50% claim their life deteriorated in last one year: Survey
'ఏడాది కాలంలో 50శాతం మంది జీవన ప్రమాణాల్లో క్షీణత'
author img

By

Published : Feb 2, 2021, 9:15 AM IST

గత ఏడాది కాలంలో తమ జీవన ప్రమాణాలు దిగజారిపోయాయని 50శాతానికిపైగా ప్రజలు భావిస్తున్నట్టు ఓ సర్వేలో తేలింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ సోమవారం బడ్జెట్​ ప్రవేశపెట్టిన అనంతరం ఈ సర్వేను నిర్వహించింది దేశంలోని ఓ మీడియా సంస్థ.

జనాభాలోని అన్ని వర్గాల వారినీ కలుపుకొని 1,200మందిపై ఈ సర్వే నిర్వహించారు. గతేడాది కాలంలో తమ జీవన ప్రమాణాలు క్షీణించాయని 50.7శాతం మంది పేర్కొన్నారు. 2020 బడ్జెట్​ సమయంలో అది 31.3శాతంగా ఉండటం గమనార్హం.

జీవన ప్రమాణాలు క్షీణిస్తున్నాయని.. 2019 బడ్జెట్​ సమయంలో 26శాతం మంది చెప్పగా.. 2015, 2016, 2017, 2018 పద్దు సమయాల్లో అవి 38.1శాతం, 39.5శాతం, 32.9శాతం, 33.4శాతంగా ఉన్నాయి.

అయితే కరోనా సంక్షోభంలోనూ తమ జీవితంలో మార్పులేదని 21.3శాతం మంది చెప్పడం విశేషం. 2020 బడ్జెట్​ సమయంలో ఇలా చెప్పిన వారు 32.1శాతం.

17.3శాతం మంది గత ఏడాది కాలంలో తమ జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని వెల్లడించారు. మరో 10.7శాతం మందికి.. వారు ఏ స్థితిలో ఉన్నారో అర్థం కావడం లేదని సర్వే పేర్కొంది.

ఇదీ చూడండి:- బలవర్ధక ఆహారానికి బహుదూరంగా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.