హరియాణాలోని కర్ణల్ జిల్లా హర్సింగ్పుర్ గ్రామంలో బోరుబావిలో పడ్డ అయిదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పాపను కాపాడేందుకు సహాయక సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చిన్నారి.. తల్లిదండ్రులకు కన్నీరే మిగిలింది.
ఇదీ జరిగింది
తమ చిన్నారి కనపడలేదంటూ కంటతడి పెట్టుకుంటూ ఆ తల్లిదండ్రులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పాప కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పాప ఆడుకుంటూ ఇంటి సమీపంలో ఉన్న బోరుబావిలో పడినట్లు అధికారులు గుర్తించారు. తక్షణమే జాతీయ విపత్తు స్పందన దళాన్ని రంగంలోకి దింపారు.
పాప కోసం బావిలోకి ప్రాణవాయువును అందించారు. కెమెరా ద్వారా చిన్నారి 50 అడుగుల లోతులో ఉన్నట్లు గుర్తించారు. పాప భయపడకుండా ఉండటానికి తల్లిదండ్రుల స్వరాన్ని రికార్డు చేసి లోపలికి పంపించారు. కానీ ఇవేమీ పాపను కాపాడలేకపోయాయి.
ఇదీ చూడండి : జేబులో చిల్లి గవ్వ లేకున్నా.. రూ.40 వేలు తిరిగిచ్చేశాడు!