తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. ఆన్‌లైన్ లాటరీ మోసానికి ఓ కుటుంబం బలైపోయింది. ముగ్గురు కుమార్తెలతో సహా తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్న ఘటన అందరి మనసులను కలిచివేసింది.
ప్రస్తుతం తమిళనాడులో లాటరీ వ్యవస్థపై నిషేధం విధించింది ప్రభుత్వం. అయినప్పటికీ విల్లుపురం సమీపంలోని సలామత్నగర్కు చెందిన ఓ స్వర్ణకారుడు ఆన్‌లైన్ ద్వారా లాటరీ టికెట్లు కొనుగోలు చేశాడు. గతంలో లాటరీ ద్వార వచ్చినవి, తన వద్ద ఉన్న డబ్బులు మొత్తం లాటరీ టికెట్ల కోసమే వెచ్చించాడు. పెద్ద మొత్తంలో సొమ్ము వస్తుందని ఆశ పెట్టుకున్న స్వర్ణకారుడు.. భారీగా నష్టపోయాడు. అప్పుల ఊబిలో కూరుకుపోయి.. మనస్తాపానికి గురయ్యాడు.
తన ముగ్గురు కుమార్తెలకు సైనైడ్ ఇచ్చి.. భార్యతో కలిసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో వీడియో రికార్డింగ్ చేసి తన బాధను వెల్లడించాడు.
ఇదీ చూడండి: కోర్టు ఆవరణలోనే కామాంధుడికి దేహశుద్ధి!