గుజరాత్ కర్జన్ సమీపంలో జాతీయ రహదారిపై ఐదు ఖరీదైన కార్లు ఒకదానితో ఒకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదు. అయితే ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.






పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని అక్కడి ప్రభుత్వం రాష్ట్రంలోని వడోదర, సూరత్, రాజ్కోట్, అహ్మదాబాద్ పట్టణాల్లో ఖర్ఫ్యూ విధించింది. దీపావళి పండుగ జరుపుకోవడానికి అని గ్రామాలకు వెళ్లిన ప్రజలు తిరిగి నగరాలకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్యలు తలెత్తున్నాయి.