ఒడిశాలో మరోసారి ఏనుగు దాడి కలకలం సృష్టించింది. అంగుల్ జిల్లాలోని రెండు గ్రామాల్లోని ఇళ్లపై గురువారం రాత్రి దాడి చేసింది. గృహాలు ధ్వంసమవటమే కాక వాటిలో నిద్రిస్తున్న ఐదుగురు మరణించారు.
మొదట సాంద గ్రామంలో ఏనుగు దాడి చేసింది. ఒక ఇంటిలో నిద్రిస్తున్న తండ్రి, ఇద్దరు కూతుర్లు మరణించారు. వేరే ప్రాంతానికి చెందిన వీళ్లు ఇక్కడ ఇటుక బట్టీలో పనిచేస్తున్నారు. ఇదే గ్రామంలో ఒక మహిళ కూడా మరణించారు.
అనంతరం సంతపాడ గ్రామంలో దాడి చేయగా.... 70 ఏళ్ల పెద్దాయన మరణించారు.
కుటుంబాలకు పరిహారం అందజేయాలని ప్రజలు నిరసన చేపట్టారు. అధికారులు ఇందుకు అంగీకరించారు. ఏనుగును తిరిగి అడవిలోకి పంపేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.