భారత్‌లో కరోనా కేసుల్లో కాస్త తగ్గుదల కనిపించింది. కొత్తగా 46,964 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 470 మంది కొవిడ్‌కు బలయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇప్పటివరకు 74 లక్షల 91 వేల మందికిపైగా కోలుకున్నారు. ఫలితంగా రికవరీ రేటు 91.54శాతానికి చేరింది. మరణాల రేటు 1.49 శాతానికి క్షీణించింది.
శనివారం ఒక్కరోజే 10 లక్షల 91 వేల కొవిడ్ నమూనాలను పరీక్షించగా.. మొత్తం పరీక్షల సంఖ్య 10 కోట్ల 98 లక్షల 87 వేలు దాటిందని ఐసీఎంఆర్ తెలిపింది.
ఇదీ చూడండి: ఇమార్తీ దేవీకి ఈసీ షాక్- ప్రచారంపై నిషేధం