ETV Bharat / bharat

ప్లాస్టిక్​ భూతం: ఆవు కడుపులో 45 కిలోల పాలిథీన్​

హరియాణా హిసార్​లో ఓ ఆవు కడుపులో నుంచి దాదాపు 45కిలోల పాలిథీన్​ను బయటకు తీశారు వైద్యులు. 8 గంటల పాటు శస్త్రచికిత్స చేసి గోమాత ప్రాణాలు కాపాడారు.

ప్లాస్టిక్​ భూతం: ఆవు కడుపులో 45 కిలోల పాలిథిన్​
author img

By

Published : Aug 28, 2019, 7:17 PM IST

Updated : Sep 28, 2019, 3:31 PM IST

ప్లాస్టిక్​ భూతం: ఆవు కడుపులో 45 కిలోల పాలిథిన్​

మన సౌలభ్యం కోసం ప్లాస్టిక్​ వస్తువులను తరచుగా ఉపయోగించడం అలవాటే. కానీ ఈ అలవాటు మూగ జీవాల పాలిట మృత్యువుగా తయారైంది. మనం వాడిన ప్లాస్టిక్​ వస్తువులను చెత్తకుప్పలో పడేసి చేతులు దులుపుకుంటున్నాం. ఆహార వేటలో ఆ మూగ జీవాలు ప్లాస్టిక్​ వస్తువులను తిని తీవ్ర అస్వస్థతకు గురవుతున్నాయి. ఇందుకు హరియాణాలో జరిగిన ఘటన ఓ ఉదాహరణ మాత్రమే.

హరియాణా హిసార్​​లోని తలవండీ రాణా గోశాలకు చెందిన ఆవును చికిత్స నిమిత్తం పశువైద్యశాలకు తీసుకెళ్లారు. పొట్ట లావుగా ఉండటం చూసి గోవు గర్భం దాల్చి ఉంటుందని అందరూ భావించారు. ఆపరేషన్ మొదలుపెట్టాక అసలు విషయం తెలిసి వైద్యులు నివ్వెరపోయారు. పొట్ట నిండా దాదాపు 45కిలోల చెత్త ఉంది. అందులో అధిక భాగం పాలిథీన్​దే. దీనితో పాటు ఇనుప వస్తువులు, రబ్బరు వస్తువులు కూడా ఉన్నాయి.

"ఆవు కొన్ని రోజులుగా బాధపడుతోందని గోసేవ సంరక్షులు మాకు చెప్పారు. బహుశా గర్భందాల్చి ఉండవచ్చని మాకు చెప్పారు. అంబులెన్స్​లో ఆవును ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఈ నెల 26న జన్మాష్టమి రోజున గోమాతకు ఆపరేషన్ నిర్వహించాం. కడుపులోంచి 40 నుంచి 45 కేజీల పాలిథీన్​ను బయటకు తీశాం."
- డా. సంజయ్​, పశు వైద్యుడు.

ఆవు పొట్టలో ఉన్న చెత్తనంతా తొలగించేందుకు వైద్యులు దాదాపు ఎనిమిది గంటల పాటు శ్రమించారు. ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసి గోవు ప్రాణాలు కాపాడారు.

ఇదీ చూడండి- రెండు నెలల్లో భారత్​తో యుద్ధం: పాక్ రైల్వే మంత్రి

Intro:Body:Conclusion:
Last Updated : Sep 28, 2019, 3:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.