దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి ఏ మాత్రం తగ్గడం లేదు. తమిళనాడు, కర్ణాటకల్లోనూ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి.
మహారాష్ట్రలో కొత్తగా 7 వేల 975 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 75 వేలు దాటింది. మరో 233 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాల సంఖ్య 10 వేల 928కి చేరింది.
లక్ష దాటిన రికవరీలు..
తమిళనాడులో ఇవాళ 4,496 మందికి వైరస్ సోకింది. మరో 68 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 2167కు చేరింది. కేసులు లక్షా 50 వేలు దాటాయి.
అయితే.. ఈ రాష్ట్రంలో బాధితులు వేగంగా కోలుకుంటున్నారు. ఇవాళ ఒక్కరోజే 5000 మంది డిశ్చార్జి అయ్యారు. మొత్తం కోలుకున్న వారి సంఖ్య లక్ష దాటింది. తమిళనాడులో ఇప్పటివరకు 17 లక్షల 36 వేలకుపైగా టెస్టులు చేశారు.
మిగతా రాష్ట్రాల్లో...
- కర్ణాటకలోనూ కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. బుధవారం మరో 3,176 మంది కొవిడ్ బారినపడ్డారు. రాష్ట్రంలో ఒక్కరోజే 87 మరణాలు నమోదయ్యాయి.
- కేరళలో ఇవాళ 623 మందికి కరోనా సోకింది. మొత్తం కేసులు 10 వేలకు చేరువయ్యాయి.
- దిల్లీలో 1647 కేసులు, 41 మరణాలు నమోదయ్యాయి.
- బంగాల్లో ఒక్కరోజే 1589 మందికి వైరస్ సోకింది. మరో 20 మంది చనిపోయారు.
- గుజరాత్లో 925 కొత్త కేసులు వెలుగుచూసాయి. ఒక్కరోజులో 10 మరణాలు నమోదయ్యాయి.