మహారాష్ట్ర రాజధాని ముంబయిలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. 24 గంటల వ్యవధిలోనే అక్కడ మరో 417 మందికి వైరస్ సోకింది. నగరంలో మొత్తం బాధితుల సంఖ్య 6,874కు చేరింది. ఇప్పటివరకు ముంబయిలో 290 మంది మరణించారు. మరో 1,472 మంది డిశ్చార్జి అయ్యారు.
దేశంలో మహారాష్ట్రనే కరోనాకు కేంద్రబిందువుగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 10498 మంది వైరస్ బారినపడగా.. ఇప్పటివరకు 459 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా 1147 కరోనా మరణాలు సంభవించాయి.