రాజస్థాన్ కరౌలీ జిల్లా కుంజెలాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలోని నలుగురు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గ్రామంలోని ఓ ఇంటి నుంచి దుర్వాసన రాగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇంట్లో భర్త, భార్య, ఇద్దరు పిల్లల మృతదేహాలను గుర్తించారు. ఇంటి యజమాని మహేంద్ర మహావర్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఉండగా.. లోపలి గదిలో అతని భార్య, ఇద్దరి పిల్లల మృతదేహాలు ఉన్నాయి.
వీరు కనీసం 3,4 రోజుల కింద చనిపోయినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. స్థానికులను విచారించిన అనంతరం ఈ మరణాలకు గృహహింసే కారణమని ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చారు.
ఇదీ చూడండి: సర్పంచ్ పట్ల కుల వివక్ష- పతాక ఆవిష్కరణకు నిరాకరణ