జమ్ముకశ్మీర్‌లోని రెసాయ్ జిల్లా కత్రాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.1గా తీవ్రత నమోదైంది. శనివారం రాత్రి 10.01 గంటలకు భూకంపం వచ్చినట్లు జాతీయ భూ విజ్ఞాన కేంద్రం తెలిపింది.
కత్రాకు తూర్పున 93కిమీ దూరంలో పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పారు.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో స్వలంగా కంపించిన భూమి...