ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలకు సంబంధించి వాట్సాప్‌లో అభ్యంతకర పోస్ట్‌లు పంపిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో జరగ్గా.. స్థానిక భాజపా నాయకుడు సత్యేంద్ర గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నలుగురు నిందితులపై కేసు నమోదు చేసినట్లు నగర పోలీస్ సూపరింటెండెంట్ ముఖేశ్ చంద్ర మిశ్రా తెలిపారు.
పట్టుబడ్డ నలుగురు నిందితులు.. యూపీ- హజ్రత్‌గంజ్‌లోని ఆర్డినెన్స్ ఎక్విప్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్లు ఓ అధికారి చెప్పారు. ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆ పోస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా ఫార్వర్డ్ అయ్యింది అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.
ఇదీ చదవండి: దేశ రాజధానిలో పట్టుబడ్డ రూ.40 కోట్ల హెరాయిన్