మాలేగావ్ వరుస బాంబు పేలుళ్ల కేసులో నలుగురు నిందితులకు బాంబే హై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే కొన్ని షరతులను విధించింది.
"పిటిషన్లను స్వీకరించాం. రూ.50,000 పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేస్తున్నాం. ప్రత్యేక న్యాయస్థానానికి విచారణ జరిగే రోజుల్లో హాజరుకావాలి. సాక్షులను కలవడానికి వీల్లేదు. ఆధారాలను తారుమారు చేయాలని ప్రయత్నించకూడదు."
- ధర్మాసనం
ఏం జరిగింది...?
2006 సెప్టెంబరు 8న మహారాష్ట్ర నాసిక్‌లోని హమిదియా మసీదు వద్ద వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ దాడిలో 37 మంది ప్రాణాలు కోల్పోగా, 100 మందికి పైగా గాయాలపాలయ్యారు.
మహారాష్ట్ర తీవ్రవాద వ్యతిరేక దళం ముందుగా కేసును విచారించి 9 మంది నిందితులను అదుపులోకి తీసుకొంది. అనంతరం కేసును సీబీఐకు అప్పగించింది. తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ కేసును విచారించింది.
- ఇదీ చూడండి: బెంగాల్ జూడాలకు మద్దతుగా దేశవ్యాప్త నిరసనలు