త్రిపురలో 2013లో జరిగిన షాజహాన్ మియా హత్య కేసుపై ఆ రాష్ట్ర అడిషనల్ సెషన్స్ కోర్టు తుది తీర్పు వెల్లడించింది. మొత్తం 13 మంది నిందితుల్లో నలుగురిని నేరస్థులుగా ప్రకటించి.. కోర్టు వారికి జీవిత ఖైదు, 25వేల జరిమానా విధించింది. దోషులలో ఓ మహిళ కూడా ఉంది. జరీనా బేగమ్, రఫీక్ మియా, మజీద్ ఖాన్, సాజల్ మియాలను హంతకులుగా కోర్టు పేర్కొంది.
నాలుగు కేజీల బియ్యం ఇవ్వనందుకు..
పశ్చిమ త్రిపుర జిల్లాలోని జైపూర్ గ్రామానికి చెందిన షాజహాన్ మియా.. 4 కేజీల బియ్యం ఇవ్వని కారణంగా హత్య చేశారు. స్థానిక పాఠశాలతో మధ్యాహ్న భోజనానికి సరకుల పంపిణీపై దోషులతో మియాకు ఒప్పందం ఉంది. మొత్తం 7 కేజీల బియ్యం ఇవ్వాల్సిందా.. అప్పటికే మూడు కేజీలు అందించాడు మియా. అయితే మిగిలిన నాలుగు కేజీలు హెడ్మాస్టర్ను సంప్రదించి ఇస్తానన్నాడు. కానీ మరుసటి రోజు ఉదయమే హంతకులు మియాను దారుణహత్య చేశారు. ఈ ఘటన 2013 సెప్టెంబరు 27న జరిగింది.
ఇదీ చదవండి : 'చైనా అలా చేస్తేనే భారత బలగాలు వెనక్కి'