సార్వత్రిక ఎన్నికల మూడో విడత పోలింగ్ స్వల్ప ఉద్రిక్తతల మధ్య ప్రశాంతంగా జరిగింది. ఈవీఎంల సమస్య మళ్లీ పునరావృతమైంది. బిహార్, కేరళలో ఉదయం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు మొరాయించాయి. అధికారులు వెంటనే సమస్య పరిష్కరించారు.
ఐదు గంటల వరకు 61.31 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం ఓటింగ్ శాతంపై ఎన్నికల సంఘం స్పష్టతనివ్వాల్సి ఉంది.
5 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం
- అసోం: 72.49 %
- బిహార్: 54.91 %
- గోవా: 68.37 %
- గుజరాత్: 56.27 %
- జమ్ము కశ్మీర్: 11.22%
- కర్ణాటక: 60.57 %
- కేరళ: 67.68 %
- మహారాష్ట్ర: 52.53 %
- ఒడిశా: 54.18 %
- త్రిపుర: 69.09 %
- ఉత్తరప్రదేశ్: 53.78 %
- బంగాల్: 74.57 %
- ఛత్తీస్గఢ్: 59.16%
- దాద్రా అండ్ నాగర్ హవేలి: 56.81%
- డమన్ అండ్ డియు: 64.82 %