ఒక్క పెళ్లి చేసుకుని వేగడమే కష్టమనుకుంటున్న ఈ రోజుల్లో ఏకంగా ఆరు పెళ్లిళ్లు చేసుకుంది కర్ణాటకలోని చిక్కమంగలూరుకు చెందిన ఓ మహిళ.
మొన్నటి వరకు బెంగళూరుకు చెందిన కిరణ్ , రమేశ్, రంగేనహళ్లికి చెందిన చంద్ర, బసవ రాజులు సహా పేరు తెలియని మరొకరికి ఏకైక సతీమణి ఆమె. ఇద్దరు బిడ్డలకు తల్లి కూడా. 38 ఏళ్లు నిండాక ఆమెకు కంబ్లీ గ్రామానికి చెందిన 22 ఏళ్ల చంద్రుపై మళ్లీ ప్రేమ పుట్టింది. తోడుగా సాగుదామని చంద్రు కోరగానే అంగీకరించి మూడు ముళ్లు వేయించుకుంది.
పెళ్లయ్యాక ఆ ఐదుగురు భర్తల సంగతి చంద్రుతో చెప్పిందామె. కానీ, ప్రేమ కోసం మిగిలిన భర్తలను వదిలేస్తానని మాటిచ్చింది. ఆరో భర్త అయిన తనకు అంతటి ప్రాధాన్యం ఇచ్చి తనకోసం వచ్చేసినందుకు సంతోషించాడు చంద్రు.
ఇదీ చదవండి: మత సామరస్యాన్ని చాటుతూ.. ముస్లిం యువతి యక్ష'గానం'..