ETV Bharat / bharat

'పోషకాహారం అందిస్తే 37 లక్షల మందిని కాపాడవచ్చు'

ప్రపంచ దేశాలు పోషక​ విలువలు పాటిస్తూ, ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తే 2025 నాటికి 37 లక్షల మంది ప్రాణాలు కాపాడవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఆ మేరకు తగు మార్గదర్శకాలను విడుదల చేసింది.

'పోషకాహారం అందిస్తే 37 లక్షల మందిని కాపాడవచ్చు'
author img

By

Published : Sep 6, 2019, 9:00 AM IST

Updated : Sep 29, 2019, 3:03 PM IST

ప్రభుత్వాలు ఆరోగ్యకరమైన ఆహారం మీద దృష్టి సారిస్తే 2025 నాటికి 37 లక్షల మంది ప్రాణాలు కాపాడవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో తెలిపింది. ఈ సందర్భంగా పోషక​ విలువలను పెంచేందుకు తగు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం మానవుని ఆరోగ్యకరమైన జీవితానికి పోషకాహారం ఎంతో అవసరమని పేర్కొంది.

శరీరానికి అందే ఆహారంలో అన్నింటికన్నా పోషకాలు​ చాలా ప్రముఖ పాత్ర పోషిస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్ధ అసిస్టెంట్​ డైరక్టర్​ జనరల్​ నాకో యమమోటో తెలిపారు. ప్రజలందరూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడానికి ఈ మార్గదర్శకాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.

"ప్రజల ఆరోగ్యం కోసం ప్రపంచంలోని అన్ని దేశాలు పోషక విలువలను పెంపొదించేందుకు కృషి చేయాలి. సరైన పోషక విలువలు అందక 90 లక్షల మంది పిల్లలలో ఊబకాయం పెరుగుతోంది. 1990-2018 మధ్య కాలంలో 4.8 నుంచి 5.9 శాతం పెరిగింది. పెద్ద వయసు వారిలో 13 శాతంగా ఉంది. ఈ సంఖ్య అన్ని దేశాలలో క్రమంగా పెరుగుతూ వస్తోంది."
-నివేదిక

5 ఏళ్ల వయసు చిన్నారులకు మెరుగైన ఆహారం అందించటం వల్ల మంచి ఫలితాలు అందాయని తెలిపింది. 1990-2018 మధ్య కాలంలో మరణాల రేటు 39.2 నుంచి 21.9 శాతానికి తగ్గిందని ప్రకటించింది. ఇదే విధంగా అన్ని దేశాలు జాతీయ ఆరోగ్య విధానాలను, వ్యూహాలను రచించి ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని ఐరాస సూచించింది.

'యూనివర్సల్​ హెల్త్​ కవరేజ్' పేరుతో సెప్టెంబర్​ 23న సమావేశమవ్వాలని ఐరాస నిర్ణయించింది. 2030 నాటికి మెరుగైన ఫలితాలే లక్ష్యంగా ఈ సమావేశం జరగునుంది.

ఇదీ చూడండి:మోదీ 2.0: నరేంద్రుడి సంచలనాల సెంచరీ

New Delhi, Sep 05 (ANI): South district Delhi Police has arrested five people including a domestic help for murdering his 91-year-old employer Krishan khosla in Greater Kailash-2. The prime accused Kishan who has admitted to the crime, said that he was frustrated with the constant nagging of his master Krishan Khosla. So, he conspired with his friends to kill his employer. After killing him, they stuffed his corpse in a refrigerator and transported it to different house in an auto-rickshaw. They fled the site after dumping his body in a pit in that house. A technology-driven comprehensive investigation helped police in nabbing the killer and his accomplices. Based on the information they arrested Kishan, they later arrested other four culprits. Kishan killed his employer in a macabre manner.
Last Updated : Sep 29, 2019, 3:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.