భారత్లో పిల్లలపై నేరాలు పెరుగుతున్నాయని వెల్లడించింది చైల్డ్ రైట్స్ అండ్ యూ అనే స్వచ్ఛంద సంస్థ. ఇటీవల విడుదలైన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సమాచారం ప్రకారం 2016-17 సంవత్సరంలో పిల్లలపై రోజుకు 350 నేరాలు జరిగాయని పేర్కొంది. 2017లో బాలలపై నేరాలు 20 శాతం పెరిగాయని వెల్లడించింది. అదే సమయంలో భారత్లో నేరాల సంఖ్య 3.6 శాతం ఎక్కువగా నమోదైందని స్పష్టం చేసింది.
2007లో 1.8 శాతంగా ఉన్న నేరాల సంఖ్య.. 2017లో 28.9 శాతానికి పెరిగిందని నివేదిక పేర్కొంది. రెండేళ్ల విరామం అనంతరం ఎన్సీఆర్బీ నివేదిక విడుదల చేసింది. 2016లో పిల్లలపై 1,06, 958 నేరాలు... 2017లో 1, 29,032 నమోదయ్యాయి.
"2017లో సుమారు 1.3 లక్షల కేసులు నమోదు కావడం.. ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజూ 350 నేరాలు పిల్లలే లక్ష్యంగా జరిగాయి."
-నివేదిక
ఆ రెండూ అధికం..
బాలలపై నేరాల్లో ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు మొదటి రెండు స్థానాల్లో ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది. 2017లో రెండు రాష్ట్రాల్లోనూ 14.8 శాతం లేదా 19వేలకు పైగా కేసులు నమోదయ్యాయని పేర్కొంది. అంతకు క్రితంతో పోలిస్తే ఝార్ఖండ్లో 73.9 శాతం అధికంగా నేరాలు నమోదయ్యాయి.
బాలల అపహరణల్లో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో ఉండగా.. ఆ జాబితాలో బిహార్ తొలిసారి ఐదోస్థానంలో నిలిచింది.
ఇదీ చూడండి: మహిళా సాధికారతకై బిహార్ వనితల 'సైకిల్ యాత్ర..!'