ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఉభయ సభల ముందుకు మొత్తం 34 బిల్లులు రానున్నాయి. వీటిలో 23 కొత్త బిల్లులు కాగా, మిగతావి ఇప్పటికే చట్టసభల్లో ప్రవేశపెట్టి స్థాయీ సంఘాల అధ్యయనం కోసం పంపించినవి. ఇందులో 11 బిల్లులను ప్రస్తుతం ఉన్న ఆర్డినెన్స్‌ల స్థానంలో తీసుకొస్తున్నారు. కేంద్ర మంత్రులు, ఎంపీల జీతభత్యాల తగ్గింపు, నిత్యావసర వస్తు చట్ట సవరణ, రైతులు దేశంలో ఎక్కడైనా తమ వస్తువులను విక్రయించుకొనేందుకు, పంటలు వేయడానికి ముందే కార్పొరేట్ సంస్థలతో కుదుర్చుకున్న కొనుగోలు ఒప్పందాలకు హామీ ఇచ్చే బిల్లులు ఉన్నాయి. అలాగే మూడు లేబర్ కోడ్ బిల్లులను చట్టసభల ముందుకు రానున్నాయి.
కొత్తగా ప్రవేశపెట్టబోయే బిల్లులివే..
1.ది మల్టీస్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ (సవరణ) బిల్లు
2. దేశ ఆర్థిక స్థిరత్వానికి సంబంధించిన ది బైల్యాటరల్ నెట్టింగ్ ఫైనాన్షియల్ కాంట్రాక్ట్స్ బిల్లు
3. నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలను నాన్‌బ్యాంకింగ్ యేతర కార్యకలాపాలకు అనుమతిచ్చే ది ఫ్యాక్టరీస్ రెగ్యులేషన్ (సవరణ) బిల్లు
4. పీఎఫ్ఆర్డీఏ నుంచి ఎన్పీఎస్ ట్రస్ట్‌ని వేరుచేసేందుకు ఉద్దేశించిన ది పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (సవరణ) బిల్లు 5.వైద్య అనుబంధ విద్యా ప్రమాణాల నిర్వహణ కోసం ఉద్దేశించిన ది నేషనల్ కమిషన్ ఫర్ అల్లైడ్ అండ్ హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ బిల్లు
6. సంతాన సాఫల్య కేంద్రాలను పర్యవేక్షించేందుకు ఉద్దేశించిన ది అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్) బిల్లు
7. జమ్మూకశ్మీర్ అధికార భాషా బిల్లు
8. దేశరాజధాని ప్రాంత చట్టంలో సవరణకు సంబంధించిన బిల్లు
9. విదేశీ విరాళాల క్రమబద్ధీకరణకు సంబంధించిన ది ఫారిన్ కంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) సవరణ బిల్లు
10. ప్రజాప్రాతినిధ్య చట్టంలో సెక్షన్ 8ఎ సవరణకు సంబంధించిన బిల్లు
11. మాన్యువల్ స్కావెంజర్స్‌కు ఉపాధి, పునరావాస కల్పన చట్టసవరణ బిల్లు
12. జువనైల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) సవరణ బిల్లు.
ఆర్డినెన్స్ స్థానంలో వచ్చే బిల్లులు
1.రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడైనా విక్రయించుకోవడానికి అనువైన వ్యవసాయదారుల ఉత్పత్తుల వ్యాపారం, వాణిజ్యం (ప్రోత్సాహం, సహకారం) బిల్లు
2. వ్యాపారులతో రైతులు ముందస్తుగా చేసుకొనే ఒప్పందాలకు భరోసా కల్పించే ది ఫార్మర్స్ (ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్) అగ్రిమెంట్ ఆన్ ప్రైసెస్ అండ్ సర్వీసెస్ బిల్లు
3. ది హోమియోపతి సెంట్రల్ కౌన్సిల్ (సవరణ) బిల్లు
4. ఇండియన్ మెడిసిన్ సెంట్రల్ కౌన్సిల్ (సవరణ) బిల్లు
5. నిత్యావసర వస్తు చట్ట సవరణ బిల్లు
6. ది ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్ట్సీ(రెండో సవరణ) బిల్లు
7. సహకార బ్యాంకుల నియంత్రణను కట్టుదిట్టంచేసేందుకు ఉద్దేశించిన ది బ్యాంకింగ్ రెగ్యులేషన్ (సవరణ) బిల్లు
8. ది ట్యాక్సేషన్ అండ్ అదర్ లాస్ (రిలాక్సేషన్ ఆఫ్ సర్టెయిన్ ప్రొవిజన్స్) బిల్లు
9. అంటువ్యాధుల (సవరణ) బిల్లు
10. మంత్రుల జీతభత్యాల సవరణ బిల్లు
11. పార్లమెంటు సభ్యుల జీతభత్యాల సవరణ బిల్లు.
ప్రస్తుతం రాజ్యసభలో ఉన్న బిల్లు
1. మార్చి 23న రాజ్యసభలో ప్రవేశపెట్టిన ‘ది పెస్టిసైడ్ మేనేజ్మెంట్ బిల్లు’ను అక్కడ ఆమోదింపజేసి లోక్‌సభకు తీసుకొస్తారు.
రాజ్యసభ ఆమోదించి లోక్‌సభలో పెండింగ్‌లో ఉన్నవి
1. ది నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి బిల్లు
2. ది నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ బిల్లు.
లోక్‌సభలో ప్రవేశపెట్టిన అనంతరం స్థాయీసంఘం అధ్యయనం చేసిన బిల్లులు
1. ది ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండీషన్స్ కోడ్
2. ది ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్
3. ది కోడ్ ఆన్ స్పెషల్ సెక్యూరిటీ
లోక్‌సభలో ప్రవేశపెట్టినా స్థాయీసంఘానికి ప్రతిపాదించని బిల్లులు
1. ది మేజర్పోర్ట్ అథారిటీస్ బిల్లు
2. ది కంపెనీస్ (సవరణ) బిల్లు,
3. నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్శిటీ బిల్లు
4. రాష్ట్రీయ రక్ష యూనివర్శిటీ బిల్లు
5. ది బ్యాంకింగ్ రెగ్యులేషన్ (సవరణ)బిల్లు.. దీన్ని ఉపసంహరించుకుంటారు.
ఇదీ చూడండి: దేశంలో ఒక్కరోజే రికార్డు స్థాయిలో 96,551 కేసులు