ETV Bharat / bharat

కరోనా విజృంభణ.. మహారాష్ట్రలో 3,390 కొత్త కేసులు - tamilnadu corona updates

భారత్​లో కరోనా ఉద్ధృతి అంతకంతకూ తీవ్రమవుతోంది. మహారాష్ట్రలో 3వేల 390 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 120 మంది మరణించారు. దేశ రాజధాని దిల్లీలో రికార్డు స్థాయిలో 2 వేల 224 మంది కొత్తగా వైరస్​ బారినపడ్డారు. తమిళనాడులో మరో 1,974 మందికి వైరస్​ సోకింది. గుజరాత్​లో 511 మంది, ఉత్తర్​ప్రదేశ్​లో 499మందికి పాజిటివ్​గా తేలింది.

corona cases in india
దేశంలో కరోనా విజృంభణ
author img

By

Published : Jun 14, 2020, 9:10 PM IST

Updated : Jun 14, 2020, 9:53 PM IST

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరుగుతోంది. వైరస్ ప్రభావం అత్యంత తీవ్రంగా మహారాష్ట్రలో కొత్తగా 3వేల 390 కేసులు నమోదయ్యాయి. మరో 120 మంది మహమ్మారికి బలయ్యారు. మొత్తం కేసుల సంఖ్య లక్షా 7వేలు దాటింది. మరణాల సంఖ్య 3,950కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసులలో 1395 ముంబయికి చెందినవే.

దిల్లీలో రికార్డు..

దేశ రాజధాని దిల్లీలో రికార్డు స్థాయిలో కొత్తగా 2వేల 224 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 56 మంది చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 41వేల 182కు చేరింది. వైరస్​ కారణంగా మరణించిన వారి సంఖ్య 1327కి పెరిగింది.

తమిళనాడులో 1974..

దక్షిణాది రాష్ట్రం తమిళనాడులో కొత్తగా 1,974 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 44,661కి చేరింది. మరణాల సంఖ్య 435కి పెరిగింది. 24,547 మంది కోలుకున్నారు. కొత్తగా నమోదైన కేసుల్లో 1,415 చెన్నైకి చెందినవే.

గుజరాత్​లో 500కుపైగా...

గుజరాత్​లో కొత్తగా 511 కేసులు వెలుగుచూశాయి. మరో 29మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 23వేల 590కి చేరింది. ఇప్పటి వరకు 1478మంది వైరస్​కు బలయ్యారు.

ఉత్తర్​ప్రదేశ్​లో..

ఉత్తర్​ ప్రదేశలో ఆదివారం మరో 499 మంది వైరస్​ బారిన పడ్డారు. 14 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 13వేల 615కు చేరగా.. మృతుల సంఖ్య 399గా ఉంది.

రాజస్థాన్​లో

రాజస్థాన్​లో కొత్తగా 133 కేసులు నమోదయ్యాయి. మరో నలుగురు వైరస్​ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 12,532కు చేరగా.. మరణాల సంఖ్య 286కి పెరిగింది. 9వేల 59 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.

అసోంలో 4 వేలకు చేరువగా..

అసోంలో మరో 43 మంది వైరస్​ బారినపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 3వేల943కు చేరింది. ఇప్పటి వరకు 8 మంది ప్రాణాలు కోల్పోయారు. 1805 మంది వైరస్​ బారి నుంచి కోలుకున్నారు.

కేరళలో..

కేరళలో కొత్త కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. మరో 54 మందికి వైరస్​ సోకింది. వారిలో ముగ్గురు ఆరోగ్య కార్యకర్తలున్నారు. మొత్తం కేసుల సంఖ్య 2,460కి చేరింది.

వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నమోదైన కేసులు

రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతంకొత్త కేసులుమొత్తం కేసులు
1మహారాష్ట్ర3,3901,07,958
2తమిళనాడు1,97444,661
3దిల్లీ2,224 41,182
4గుజరాత్​511 23,590
5ఉత్తర్​ప్రదేశ్​499 13,615
6రాజస్థాన్​133 12,532
7అసోం433,943
8కేరళ542,460
9త్రిపుర451,046
10పుదుచ్చేరి18197
11నాగాలాండ్​5168
12మిజోరాం5112

Last Updated : Jun 14, 2020, 9:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.