ETV Bharat / bharat

రైతులు, కూలీల మృత్యుఘోష- 43 వేల మంది ఆత్మహత్య - ఎన్​సీఆర్​బీ నివేదిక

భారత్​లో ఆత్మహత్య బాధితుల సంఖ్య 2019లో భారీగా పెరిగింది. మొత్తం 1.39 లక్షల మంది ప్రాణాలు తీసుకున్నట్లు జాతీయ నేర నమోదు విభాగం నివేదించింది. వీరిలో అత్యధికంగా 23.4 శాతం రోజువారీ కూలీలే ఉన్నారని తెలిపింది. వ్యవసాయ రంగంలో 10 వేల మందికిపైగా ఆత్మహత్య చేసుకున్నట్లు స్పష్టం చేసింది.

SUICIDE REPORT
రైతులు, కూలీల మృత్యుఘోష
author img

By

Published : Sep 2, 2020, 6:49 PM IST

దేశంలో 2019లో 43 వేల మంది రైతులు, కూలీలు ఆత్మహత్య చేసుకున్నట్లు జాతీయ నేర నమోదు విభాగం (ఎన్​సీఆర్​బీ) నివేదించింది. దేశవ్యాప్తంగా నమోదైన ఆత్మహత్యల్లో రోజువారీ కూలీలవే 23.4 శాతంగా ఉన్నాయని తాజా నివేదికల ద్వారా తెలిసింది.

2018తో పోలిస్తే గతేడాది రోజువారీ కూలీల ఆత్మహత్యలు పెరిగాయి. 2018లో 30,132 మంది ప్రాణాలు తీసుకోగా.. 2019లో 32,563 మంది ఆత్మహత్య చేసుకున్నారని ఎన్​సీఆర్​బీ నివేదిక వెల్లడించింది.

రైతు సంక్షోభం..

వ్యవసాయ రంగంలో మొత్తం 10,281 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మొత్తం ఆత్మహత్య బాధితుల్లో వీరు 7.4 శాతంగా ఉన్నారు. 2018లో 10,349 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు.

  • రైతులు- 5,857 మంది (పురుషులు 5,563; మహిళలు 394 మంది)
  • వ్యవసాయ కూలీలు- 4,324 మంది (పురుషులు 3,749; మహిళలు 575 మంది)

మహారాష్ట్రలోనే అధికం..

రైతు ఆత్మహత్యలు మహారాష్ట్రలోనే అధికంగా 38.2 శాతం నమోదయ్యాయి. తర్వాతి స్థానాల్లో కర్ణాటక (19.4), ఆంధ్రప్రదేశ్​ (10 శాతం), మధ్యప్రదేశ్​ (5.3 శాతం), తెలంగాణ (4.9 శాతం) ఉన్నాయి. అయితే, బంగాల్​, బిహార్, ఒడిశా, ఉత్తరాఖండ్​, మణిపుర్​ రాష్ట్రాల్లో రైతు ఆత్మహత్యలు నమోదు కాలేదని తెలిపింది ఎన్​సీఆర్​బీ.

దేశవ్యాప్తంగా 2019లో ఆత్మహత్య చేసుకున్నవారి సంఖ్య భారీగా పెరిగింది. 2018లో 1,34,516 మంది ఆత్మహత్య చేసుకోగా.. 2019లో 1,39,123 మంది ప్రాణాలు తీసుకున్నారు.

వర్గాల వారీగా..

  • రోజువారీ కూలీలు- 23.4 శాతం
  • గృహిణులు- 15.4 శాతం
  • స్వయం ఉపాధి పొందే వారు- 11.6 శాతం
  • నిరుద్యోగులు- 10.1 శాతం
  • ఉద్యోగులు- 9.1 శాతం
  • విద్యార్థులు, రైతులు- 7.4 శాతం
  • పదవీ విరమణ పొందిన వారు- 0.9 శాతం
  • ఇతరులు- 14.7 శాతం

అక్షరాస్యత పరంగా..

తాజా నివేదిక ప్రకారం.. ఆత్మహత్య చేసుకున్న వారిలో నిరక్షరాస్యులు 17,588 మంది (12.6 శాతం) ఉన్నారు. డిగ్రీ, ఆపై అర్హతలు ఉన్నవారు 5,185 (3.7 శాతం) మంది ఉన్నారు.

ఆత్మహత్య బాధితుల్లో 66.7 శాతం మంది వివాహితులు కాగా.. 23.6 శాతం మంది పెళ్లికానివారు ఉన్నారని ఎన్​సీఆర్​బీ నివేదిక వెల్లడించింది.

ఇదీ చూడండి: సేవ చేసిన ఎద్దుపై రైతు మమకారం.. విగ్రహం ఏర్పాటు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.