కర్ణాటకలోని కలబుర్గీ జిల్లాలో నిన్న పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సెడం తాలుకా శిలరకోట గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆహారం సేవించిన అనంతరం.. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో చిన్నారులు వాంతులు, విరోచనాలతో ఇబ్బందిపడ్డారు. ఉపాధ్యాయులు, సంరక్షకులు వెంటనే పిల్లలను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం సద్దాంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
30 మంది విద్యార్థుల్లో 28 మంది పరిస్థితి మెరుగవగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్య అధికారులు తెలిపారు. ఆసుపత్రిని సందర్శించిన పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.