ETV Bharat / bharat

ఉగ్రకుట్ర భగ్నం​.. భారీగా ఆయుధాలు స్వాధీనం - India-Bangladesh border latest news

భారత్​-బంగ్లాదేశ్​ సరిహద్దుల్లో భారీ సంఖ్య అక్రమ ఆయుధాలను పట్టుకున్నాయి సరిహద్దు భద్రత దళాలు(బీఎస్​ఎఫ్​). వాటిని రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి ఉగ్రకుట్రలకు చెక్​ పెట్టాయి. వారి నుంచి రెండు వాహనాలు, భారీ సంఖ్యలో ఆయుధ సామగ్రి సహా నగదు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

30 automatic rifles, nearly 8,000 cartridges seized; 3 arrested in Mizoram
ఉగ్రకుట్రను భగ్నం చేసిన బీఎస్​ఎఫ్​!
author img

By

Published : Sep 29, 2020, 8:37 PM IST

భారత్​-బంగ్లాదేశ్​ సరిహద్దుల్లో ఉగ్రకుట్రలను భగ్నం చేశాయి సరిహద్దు భద్రత బలగాలు(బీఎస్​ఎఫ్). భారీ స్థాయిలో అక్రమ ఆయుధాల తరలింపును బీఎస్​ఎఫ్ అధికారులు ​అడ్డుకున్నారు. మిజోరాం మమిత్​ జిల్లాలో వాటిని స్వాధీనం చేసుకున్నారు.

సరిహద్దుల్లో తనిఖీలు నిర్వహించిన బీఎస్​ఎఫ్​ బలగాలు.. అక్రమంగా ఆయుధాలు రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు వాహానాలు, భారీ సంఖ్యలో ఆయుధ సామగ్రి సహా రూ. 39,020 నగదు స్వాధీనం చేసుకున్నారు.

30 automatic rifles, nearly 8,000 cartridges seized; 3 arrested in Mizoram
ఉగ్రకుట్రను భగ్నం చేసిన బీఎస్​ఎఫ్​!

అందులో ఏకే-47, ఏకే 74 తుపాకులు సహా అమెరికాలో తయారైన 7,894 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆ ముగ్గురు నిందితులు ఐజ్వాల్​లో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. వారిలో ఒకరు మయన్మార్ నుంచి వచ్చినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. పూర్తి దర్యాప్తు కోసం రాష్ట్ర పోలీసులకు అప్పగించినట్లు సైన్యాధికారులు స్పష్టం చేశారు. ​

ఇదీ చూడండి: యూపీ 'నిర్భయ' మృతి- పెల్లుబుకిన జనాగ్రహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.