కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ అనుచరుడు, భాజపా కార్యకర్త సురేంద్ర సింగ్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఉత్తరప్రదేశ్ డీజీపీ ఓపీ సింగ్ తెలిపారు. హత్య అనంతరం మొత్తం ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా ముగ్గురికి సంబంధమున్నట్లు నిర్ధరించారు.
నిందితుడి తండ్రితో సురేంద్ర సింగ్‌కు గతంలో రాజకీయ కక్షలు ఉన్నట్లు డీజీపీ వెల్లడించారు.
ఈ హత్య కేసుపై విచారణ వేగవంతం చేయాలని యూపీ ముఖ్యమంత్రి యోగీ అదిత్యనాథ్ డీజీపీని ఆదేశించిన మరునాడే అరెస్టులు జరిగాయి.
శనివారం రాత్రి దుండగులు జరిపిన కాల్పుల్లో అమేఠీ జిల్లా బరౌలియా గ్రామానికి చెందిన 50 ఏళ్ల సురేంద్ర సింగ్ మరణించాడు.
ఇదీ చూడండి: మోదీ ప్రమాణ స్వీకారానికి రజినీ, కమల్‌కు ఆహ్వానం