జవాన్లపై తూటాల వర్షం
జమ్ముకశ్మీర్ కుప్వారా జిల్లాలో సీఆర్పీఎఫ్ బలగాలపై ముష్కరులు దాడికి తెగించారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. వాంగమ్-ఖాజియాబాద్ ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ పార్టీపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఘటనా ప్రాంతాన్ని మూసేసింది సైన్యం. అదనపు బలగాలను తరలించింది. ఉగ్రమూకలపై ఎదురుదాడికి దిగింది. ఆపరేషన్ కొనసాగుతోంది.
ఇదే జిల్లాలో మరో ఐదుగురు
సోమవారం ఇదే జిల్లాలోని హంద్వారా ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ కల్నల్, మేజర్ సహా ఐదుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.