జమ్ముకశ్మీర్‌లో భాజపా కార్యకర్తల లక్ష్యంగా మరోసారి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. కుల్గామ్‌లోని వైకే పురాలో జరిగిన ఈ దాడిలో ముగ్గురు కార్యకర్తలు మృత్యువాతపడ్డారు. ఘటన జరిగిన తర్వాత క్వాజిగంద్లోని ఆసుపత్రికి తరలించగా.. వాళ్లు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
లష్కరే తొయిబాకు చెందిన షాడో గ్రూప్- ద రెసిస్టెంట్ ఫ్రంట్ ఈ దాడి చేసినట్లు ప్రకటించింది. సామాజిక మాధ్యమాల వేదికగా "శ్మశానాలు నిండిపోతాయి" అనే సందేశాన్ని పంపింది.
ఈ ఏడాది జూన్ నుంచి భాజపా కార్యకర్తలపై ముష్కరులు దాడులు చేస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు 8 మందిని చంపారు. బందిపొరాలో జులైలో జరిగిన ముష్కరుల దాడిలో ఓ భాజపా నేత, ఆయన తండ్రి, సోదరుడు మరణించారు.
ఇదీ చూడండి: 'పాక్ గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు'