28వేల మంది భద్రతా సిబ్బందిని కశ్మీర్లో మొహరించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఇంత పెద్ద మొత్తంలో బలగాల మోహరింపుపై కేంద్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
రాష్ట్రంలోని సున్నిత ప్రదేశాల్లో సీఆర్పీఎఫ్ జవాన్లను మోహరిస్తోంది ప్రభుత్వం. శ్రీనగర్‌లోని ప్రధాన ప్రదేశాలను కేంద్ర సాయుధ పారామిలిటరీ దళం(సీఏపీఎఫ్) ఇప్పటికే స్వాధీనం చేసుకుంది.
ఇటీవలే 10వేల మంది భద్రతా సిబ్బందిని కశ్మీర్ లోయకు తరలించింది కేంద్రం. శాంతి భద్రతల పర్యవేక్షణ, తిరుగుబాటు కార్యకలాపాలను అడ్డుకునేందుకు ఈ చర్యలు చేపట్టినట్టు గతంలో వెల్లడించింది.
భారీ సంఖ్యలో ఉన్న బలగాలను చూసి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. నిత్యావసర వస్తువులను ముందుగానే కొనుగోలు చేసుకుంటున్నారు.
ఇదీ చూడండి- భారత్ సహకారం గొప్పగా ఉంది: అమెరికా