ETV Bharat / bharat

మహారాష్ట్ర, తమిళనాడులో ఆగని 'కరోనా' ఉద్ధృతి

భారత్​లో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. లాక్​డౌన్​ ఆంక్షలు సడలించిన నేపథ్యంలో కేసుల సంఖ్యలో రోజుకో రికార్డు నమోదవుతోంది. దేశంలో 2 లక్షల 36వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. 6,642 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్​ రాష్ట్రాల్లో వైరస్​ ప్రభావం తీవ్రంగా ఉంది.

INDIA CORONA
మహా విజృంభన... 82 వేలు దాటిన కరోనా కేసులు
author img

By

Published : Jun 6, 2020, 9:04 PM IST

Updated : Jun 6, 2020, 9:20 PM IST

దేశంలో లాక్​డౌన్​ ఆంక్షలు సడలించిన నేపథ్యంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మహారాష్ట్ర, గుజరాత్​, తమిళనాడు​లపై వైరస్​ ప్రభావం అధికంగా ఉంది. దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 2.36 లక్షలకు చేరింది. 6,642 మంది మృతి చెందారు. 1,14,073 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.

మహారాష్ట్రలో 82వేలకుపైగా...

మహారాష్ట్రలో ఒక్కరోజులోనే 2,739 కొత్త కేసులు నమోదయ్యాయి. 120 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 82,968కి చేరింది. మరణాలు 2,969కి చేరాయి.

తమిళనాడులో...

తమిళనాడులో గత 24 గంటల్లో 1,458 కొత్త కేసులు నమోదయ్యాయి. 19 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసులు 30,152, మరణాలు 251కి చేరాయి. ఈ ఒక్కరోజులో చెన్నైలో అత్యధికంగా 1,146 మంది వైరస్​ బారిన పడ్డారు.

గుజరాత్​లో..

గుజరాత్​లో కొత్తగా 498 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. 29 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 19,617కి చేరగా మృతుల సంఖ్య 1,219కి చేరింది.

కర్ణాటకలో...

కర్ణాటకలో శనివారం మరో 378 మందికి కరోనా నిర్ధరణ అయ్యింది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 5వేలకు దాటింది. 59 మంది వైరస్​ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. శనివారం 280 మంది కొవిడ్​ నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. తాజాగా నమోదైన కేసుల్లో 333 మంది ఇతర రాష్ట్రాలకు చెందినవారని అధికారులు తెలిపారు.

ఒక్కరోజులో అత్యధికం...

ఒడిశాలో శనివారం కొత్తగా 173 మందికి మహమ్మారి సోకింది. ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం. ఇప్పటివరకు 2,781 మంది కొవిడ్​ బారిన పడ్డారు.

బంగాల్​లో పరిస్తితి...

పశ్చిమ బంగలో మరో 435 మందికి వైరస్​ నిర్ధరణ అయ్యింది. 17 మంది మహమ్మారితో మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,738 మంది కరోనా బారిన పడగా.. 311 మందిని వైరస్​ బలి తీసుకుంది.

ఎడారి ప్రాంతంలో..

రాజస్థాన్​లో మరో 44 మందికి పాజిటివ్​ నిర్ధరణ అయ్యింది. రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 10,128కి చేరింది. 219 మంది మహమ్మారికి బలయ్యారు.

హరియాణాలో శనివారం రికార్డు స్థాయిలో 355 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం. దీంతో వైరస్​ బారిన పడిన వారి సంఖ్య రాష్ట్రంలో 4వేలకు చేరువైంది.

Last Updated : Jun 6, 2020, 9:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.